Content feed Comments Feed

ఓంకారం – హిందూ సర్వస్వం

హిందూ ధర్మం మొత్తానికి అర్థం ఓంకారంలోనే ఉంది. ఆ మూల తత్వం పూర్తిగా అర్థం చేసుకుంటే తప్ప హిందూత్వం లోని ఏకాత్మత అర్థమయి సకల సందేహాలు తీరవు. హిందూ మతం మొత్తాన్ని ఒక్క వాక్యంలో చెప్పటం కాదు. ఒక్క పదంలో చెప్పటం కాదు. ఒక్క అక్షరంలో చెప్పవచ్చు. అదే “ఓం”. ....

ఆత్మహత్య దిశగా హిందుత్వం

ఒకనాడు విశ్వమంతటికీ జ్ఞానజ్యోతిని చూపిన హిందూ ధర్మం నేడు మినుకుమినుకు మంటూ ఉంది. ముందు జాగ్రత్తపడితే అది భద్రంగా ఉంటుంది. కానీ ఏ ప్రయత్నం చేయకుండా "ఇది నశించదు,శాశ్వతంగా ఉంటుంది" అని ఏదో సమాధానపడిపోతూ నిమ్మకునీరెత్తినట్లు ఊరుకుండిపోయేవారెక్కువయ్యారు. ఒకనాడు ప్రపంచమంతా వ్యాపించిన హిందూ ధర్మానికి ప్రపంచంలో నేటి ఉనికి ఎంత?...

గోమాత

హిందూ ధర్మంలో గోవుకు చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఎంతో విలువైన గోవు హిందువులకు పవిత్రమైనది. అంటే ప్రపంచ మానవాళికే ముఖ్యమైనదని అర్థం. అలా గ్రహింపక మతదృష్టితో చూచి ప్రపంచం చాలా నష్టపోతోంది. ఎవరేమన్నా హిందువులకది తల్లివంటిది, దైవం వంటిది కూడా. అది హిందూ శబ్ద లక్షణంలోనే చెప్పబడింది.
CahayaBiru.com
శ్రీకంఠ  జ్వాలో గ్రస్సకలామరాతిభయదః క్ష్వేళఃకఠంవా త్వయా దృష్టః కించ కరే ధృతః కరతలే కిం పక్వజంభూఫలమ్। జిహ్వాయాం నిహితశ్చసిద్ధఘటికా వా కంఠదేశే భృతః కింతే నీలమణి ర్విభూషణమయం శంభోమహాత్మ న్వద॥ శ్రీకంఠా! శివా! సముద్రమధనవేళ ఉద్భవించిన విశ్వభయంకర విషజ్వాలలను నీసుకుమార నేత్రాలు ఎలావీక్షించగలిగాయి!  శంకరా! ఆవిషజ్వాలలను నీసుకుమార కరాలు ఎలా తాకి పట్టుకోగలిగాయి! చంద్రశేఖరా! దుర్భరమైన ఆకాలకూటవిషాన్ని నీనాలుక ఎలాసహించగలిగింది! అదేదో బెల్లపు‌ ఉండవలె, నేరేడుపండువలె, నోట్లోవేసుకుని చప్పరిస్తున్నావంటే అత్యాశ్చర్యకరం! నీమహిమ వర్ణనాతీతం. భక్తసులభ  నాలంవా...
దర్శనం  త్వత్పాదాంబుజ మర్చయామి పరమం త్వాం చింతయామ్యన్వహం త్వామీశం శరణం వ్రజామి వచసా త్వామేవ యాచేవిభో। వీక్షాం మే దిశ చాక్షుషీం సకర్ఉణాం దివ్యైశ్చిరం ప్రార్థితాం శంభో లోకగురో మదీయ మనసః సౌఖ్యోపదేశం కురు॥ దేవేంద్రపూజితా! నీపాదపద్మాలు నిత్యం అర్చిస్తున్నాను. బ్రహ్మాది దేవసేవితా! నీదివ్యరూపం చిత్తంలో నిత్యం ధ్యానిస్తున్నాను. విష్ణుదేవవినుతా! నిర్మలమతితో నీకథాశ్రవణం నియతితో చేస్తున్నాను. కవీంద్ర సంసేవితా! నీచరణ నీరజాలు శరణాలని నిత్యం వేడుకుంటున్నాను. సదుపదేశాలుచేసే జగద్గురూ! దేవముని సిద్ధ సాధ్యాదులు అర్థించే నీదర్శన స్పర్శన...
ఇంద్రియసిథ్థి  కదా నా త్వాం దృష్ట్వా గిరిశ తవ భహ్యాంఘ్రియుగళం గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్। నమాశ్లిష్యాఘ్రాయ స్పుట జలజగంధాన్ పరిమళౌ నలభ్యాం బ్రహ్మాద్యై ర్ముదమనుభవిష్యామి హృదయే॥ శివసుందర సాయీశా! మహేశా! నాఇంద్రియాలు నీసేవ ముదమార ఎప్పుడు చేస్తాయోకదా? నాహస్తాలు సంతోషంతో పొంగిపోయి ఎప్పుడు నీచరణారవింద సంవాహన చేస్తాయో? నాశిరస్సు ఎప్పుడు నీపాదపద్మాల మ్రోలవ్రాలి పవిత్ర పాదధూళిని స్పృశిస్తుందో? నానేత్రాలు ఏనాడు నీపాదపద్మ సౌందర్యం కనులారా తిలకిస్తాయో? నామనస్సు చిదాకాశంలో నీపరమపద సౌవర్ణశిఖరం దర్శించి ఆదృష్టిని అలానే...
జీవన్ముక్తి కరోమి త్వత్పూజాం సపది సుఖయో మే భవ విభో విదిత్వం విష్ణుత్వం దిశసి ఖలు తస్యాః ఫలమితి। పునశ్చత్వాం ద్రష్టుం దివి భువి వహన్ పక్షిమృగతా మదృష్ట్వా తత్ధేదం కథమిహ సహే శంకరవిబో॥ ఓసాయీశ్వరా! భక్తకల్పతరువా! నీదయ అపారం. అడిగినదానికంటె అధికంగా ఇస్తావు. ఎంతపెద్దవరం అయినా వేగమే ఇయ్యగలవు. వీడు నన్నుగూర్చి బాగాభజించాడు అని విష్ణుపదవి ఇచ్చావనుకో నేను వరాహమునై నీపాదపద్మములు వెతకలేను. వీడు బాగా ధ్యానం చేశాడు బ్రహ్మపదవి ఇచ్చావనుకో హంసనై నీశిరోజాగ్రం ఆకాశమంతా వెతికిపట్టుకోలేను. నీకేమి నీవేవైనా ఇస్తావు. కానీ నేను దక్కించుకోవద్దూ....
నీభక్తుడను దురాశాభూయిష్టే దురధిపగృహద్వారఘటకే దురంతే సంసారే దురితనిలయే దుఃఖజనకే। మదాయాసం కిం నవ్యపనయసి కస్యోపకృతయే వదేయం ప్రీతిశ్చేత్తవ శివ కృతార్థాః ఖలు పయమ్॥ ఓశివా! భక్తవత్సలా! దీననాథ! నేను ఈభవసాగరంలో పడిపోయాను. ఈ జంబాలకూపంలో దుర్జనులతోడి దుర్మార్గాలు, దురాశాలతలు నన్ను పాశబద్దుణ్ణి చేస్తున్నాయి. దుష్ట దుర్మదాధికారుల గృహాలు, గృహాలయందు యాచనా విహారాలు, చింతలు పంతలు నన్ను బాధిస్తున్నాయి. సారహీన సంసార సాగర తరంగాలు భయంకరంగాలేచి నన్ను భీతిల్లజేస్తున్నాయి. పాపవాగుర దుఃఖాలతో ఆచ్చాదితములైన ఊబిప్రవాహాలు నన్ని లోనికి లాక్కుపోతున్నాయి. ప్రభూ!...
విధి విరించిర్ధీర్ధాయ ర్భవతు భవతా తత్పరశిర శ్చతుష్కం సంరక్షం సఖలు భువిదైస్యం లిఖితవాన్। విచారః కోవా మాం విశదకృపయా పాతి శివ తే కటాక్షవ్యాపారః స్వయమపిచ దీనావనపరః॥ సాయీ!సాంబా! కారుణ్యసాగరా! నన్నిలా సృజించిన బ్రహ్మదేవుణ్ణి నాల్గుకాలాలపాటు బ్రతకనీ. కష్టాలన్నీ మాకేరాయనీ. ఘోరారణ్యాలలో బ్రతకమని వ్రాసినా వ్రాయనీ. మందభాగ్యులు ధీనులు హీనులు అని వ్రాసినా వ్రాయనీ. అవికూడా మామంచికే. అవి ఉంటేనే మేము నిన్ను ఆశ్రయించేది. నీ భజనచేసేది. నీవు ఔదార్యం చూపి రక్షించేది. కష్టాలే లేకపోతే నీసాంగత్యం నీభక్తిమాధుర్యం లభించేదికాదేమో. ఆయన వ్రాతలు...
దీనరక్షకుడు  అసారే సంసారే నిజభజనదూరే జడధియా భ్రమంతం మా మందం పరమకృపయా పాతుముచితమ్। మదన్యః కో దీన స్తవ కృపణ రక్షాతినిపుణః త్వదన్యః కో వా మే త్రిజగతి శరణ్యః పశుపతే॥ పశుపతీ! సర్వభూతాధిపతీ! శంకరా! నేను నీకథాశ్రవణం చేయలేదు. నీసంకీర్తన వినిపించుకోలేదు. నీనామం స్మరించలేదు. నీపాదపద్మాలకు అభివందనం చేయలేదు. నటరాజా! నీ పరిచర్య చేయలేదు. నీ పాదార్చన నిర్లక్ష్యం చేశాను. నీదాస్యం చిన్నతనంగా భావించాను. నీతో మైత్రిచేయాలనికూడా అనుకోలేదు. నీకు ఆత్మనివేదనం చేయాలనే సంగతే తెలియదు. సాయీశ్వరా! సర్వేశా! సారహీనమైన సంసారచక్రంలో పడి నలిగి నశించిపోతున్నాను....
పరమానందలహరి  నరత్వం దేవత్వం నగవస మృగత్వం మశకతా పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననమ్। సదా త్వత్పాదాబ్జ స్మరణ పరమానందలహరీ విహారాస్తకం చేద్ధృదయ మిహకిం తేన వపుషా॥ పార్వతీశా! సర్వలోకాధీశా! సాయీశా! నాకు ముందుముందు ఏజన్మ ప్రసాదిమ్చినా ప్రభుపాదభక్తిరసంతో నిండిన హృదయం ఉండేలా చూడు ప్రభూ! స్వామీ నన్ను నరునిగా, వానరునిగా, రాక్షసునిగా ఎలా పుట్టించినా పరవాలేదు. మృగధరా! మేరుధరా! శశిధరా! శివా! నన్ను కొండగా చేసినా,పక్షిగా చేసినా, వనంలో మృగంగా చేసినా దిగులుపడను. శ్రీకాళహస్తీశ్వరా నన్ను చెట్టుగా, సరోవరంగా, సాలెపురుగుగా ఎలాసృజించినా...
ఇంద్రియాలు  మనప్తే పాదాబ్జే నివసతు వచః స్తోత్ర ఫణితౌ కర శ్చాభ్యర్చాయాం శ్రుతిరపి కథాకర్ణనవిధౌ। తవధ్యానే బుద్ధి ర్నయన యుగళం మూర్తివిభవే పరగ్రంధైః కిం వా పరమ శివ జానే పరమతః॥ పరమశివా! సాయిదేవా! జ్ఞానస్వరూపా! నిర్థూతపాపా! నామనస్సు ఒకతుమ్మదయై నీపాదపద్మం వ్రాలి కర్ణికపై నిలిచి భక్తిమకరందాన్ని పానం చేస్తుండాలి. వాత్సల్యమూర్తీ! నావాక్కులు సుధాధారలై మధురభావల జాలులో ప్రవహించి నీపవిత్రస్తోత్ర సముద్రంలో లీనమై చరితార్థాలు కావాలి. మహైశ్వర్య ప్రదా! నాహస్తపద్మాలు నీ సమస్తోపచారాలతో పరిమళించి బాగుగా వికసించాలి. నాగేంద్రభూషణా! నా కర్ణపుటాలు...
ఏకైక ఫలప్రదాత సహస్రం వర్తంతే జగతి విబుధాః క్షుద్రఫలదాః సమన్యే స్వప్నేవా తదనుసరణం తత్కృతఫలమ్। హరిబ్రహ్మాదీనాం అపి నికటభాజా మసులభం చిరంయాచే శంభో శివ తవపదాంభోజ భజనమ్॥ పరమశివా! దయాసముద్రా! అక్షయ వరప్రదాతా! భక్త చింతామణీ! కామధేనూ! నీపాదారాధన విడిచి అల్పఫలాలు ఇచ్చే క్షుద్రదేవతల పాదాలుపట్టి అర్థించలేను. భ్రమలోపడి మణులను వీడి గాజుపెంకులవెంట పరిగెత్తలేను. పాలు ఇచ్చే కామధేనువును కాదని గొడ్డుటావువెంట కుండగొని పోవలేను. హరిబ్రహ్మాదులకే లభ్యములుకాని నీపవిత్ర పాదపద్మాలు నాహృదయచక్రంలో నిలుపుకొని నిత్యం ధ్యానం చేసుకొంటాను. మహాదేవ! నన్ను...
శ్రీసత్యసాయిబాబా కరుణాకటాక్షాలతో 'శాంతిశ్రీ' జంద్యాల వేంకటేశ్వరశాస్త్రిగారు జగద్గురు ఆదిశంకరాచార్య విరచితం శివానందలహరికి తెలుగులో అర్థాన్ని తెలుపుతూ గ్రంధం వెలువరించారు. కార్తీకమాసం సందర్భంగా ప్రతిరోజూ కొన్నిశ్లోకాలను ప్రచురించ సంకల్పించాను. ఓం నమఃశివాయశివశక్తే నమస్తుభ్యం కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపః ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతుమే। శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృదిపున ర్భవాభ్యాం ఆనంద స్పురదనుభవాభ్యాం నతిరియమ్॥ శివపార్వతులు సర్వకళా స్థానీయులు. శ్రీచక్ర విరాజితులు. వేదసాహితీ మూర్తులు. చంద్రుని ...