Content feed Comments Feed

ఓంకారం – హిందూ సర్వస్వం

హిందూ ధర్మం మొత్తానికి అర్థం ఓంకారంలోనే ఉంది. ఆ మూల తత్వం పూర్తిగా అర్థం చేసుకుంటే తప్ప హిందూత్వం లోని ఏకాత్మత అర్థమయి సకల సందేహాలు తీరవు. హిందూ మతం మొత్తాన్ని ఒక్క వాక్యంలో చెప్పటం కాదు. ఒక్క పదంలో చెప్పటం కాదు. ఒక్క అక్షరంలో చెప్పవచ్చు. అదే “ఓం”. ....

ఆత్మహత్య దిశగా హిందుత్వం

ఒకనాడు విశ్వమంతటికీ జ్ఞానజ్యోతిని చూపిన హిందూ ధర్మం నేడు మినుకుమినుకు మంటూ ఉంది. ముందు జాగ్రత్తపడితే అది భద్రంగా ఉంటుంది. కానీ ఏ ప్రయత్నం చేయకుండా "ఇది నశించదు,శాశ్వతంగా ఉంటుంది" అని ఏదో సమాధానపడిపోతూ నిమ్మకునీరెత్తినట్లు ఊరుకుండిపోయేవారెక్కువయ్యారు. ఒకనాడు ప్రపంచమంతా వ్యాపించిన హిందూ ధర్మానికి ప్రపంచంలో నేటి ఉనికి ఎంత?...

గోమాత

హిందూ ధర్మంలో గోవుకు చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఎంతో విలువైన గోవు హిందువులకు పవిత్రమైనది. అంటే ప్రపంచ మానవాళికే ముఖ్యమైనదని అర్థం. అలా గ్రహింపక మతదృష్టితో చూచి ప్రపంచం చాలా నష్టపోతోంది. ఎవరేమన్నా హిందువులకది తల్లివంటిది, దైవం వంటిది కూడా. అది హిందూ శబ్ద లక్షణంలోనే చెప్పబడింది.
CahayaBiru.com

జై శ్రీరామ్
జై హనుమాన్

ఒక గృహస్థు ఒక బ్రాహ్మణునికి ఒకానొక పర్వదినమున ఒక గోవును దానం చేశాడు. ఆ సంగతి తెలిసిన నలుగురు దొంగలు ఎలాగైనా ఆ గోవును తమ సొంతం చేసుకోవాలనే పన్నాగంతో నలుగుర్లో ఒకడు ఆ బ్రాహ్మణునికెదురేగి అయ్యయ్యో ఏమి బ్రాహ్మణుడివయ్యా మేకను తీసుకొని పోతున్నావేంటీ అని వెటకారంగా అనే సరికి బ్రాహ్మణుడు కోపంతో ఇది మేకకాదు ఆవు అని చెప్పి ముందుకు వెళ్ళిపోయాడు. మరికొంతదూరం వెళ్ళాక మరొకడు ఛీ!ఛీ!ఛీ! బ్రాహ్మణులు కూడా మేకలను తినేస్తుంటే ఏంచేస్తాం, అని అసహ్యంతో చెప్తూ వెళ్ళే సరికి ఆ బ్రాహ్మణుడికి అనుమానమేసి గోవువైపు చూశాడు. మరికొంత దూరం వెళ్ళేసరికి మరొకడు ఎదురుపడి అయ్యో పిచ్చి బ్రాహ్మణుడా! తింటే తిందువుగానీ కానీ ఇంత బాహాటంగా మేకను తీసికెళ్తున్నావు. సిగ్గనిపించటల్లేదా అని అడిగేసరికి చాలా అయోమయానికి గురైన ఆ బ్రాహ్మణుడు అలాగే మరికొంతదూరం వెళ్ళేసరికి నాలుగోవాడు ఎదురుపడి, ఏం పంతులుగారూ! మేకను తీసుకొని వెళ్తున్నారు. ఈ రోజు మీ ఇంట్లో విందు భోజనమనుకుంటాను. మమ్మల్నికూడా రమ్మంటారా అని అడిగేసరికి ఆ బ్రాహ్మణుడు ఇంతమందికి ఇది మేకగా కనపడుతోంది. ఇది నిజంగా మేకనే అయిఉండవచ్చనీ దానిని అక్కడే వదలి వెళ్ళిపోయినట్లు.........

ఛీఛీ! ముఖాన ఆభస్మమేంటి ఆచందనమేంటి బొట్టేంటి అసహ్యంగా మేంచూడండి పౌడర్లు క్రీములు స్నోలు అనే సరికి ముఖాన భస్మరేఖలు, చందనము కుంకుమ అన్నీమానేసి, పౌడర్లు, స్నోలు, క్రీములు మొదలుపెట్టాం....గుళ్ళూ గోపురాలకు వెళ్ళి రాళ్ళకీ చెట్లకూ పూజలు చేస్తారా అని హేళనచేస్తుంటే అవన్నీ మానేసి క్లబ్బులకూ పబ్బులకూ వెళ్ళటం అలవాటు చేసుకున్నాం.

తల్లీదండ్రులను పూజిస్తున్నారా, వాళ్ళగొప్పదనమేముంది. జస్ట్ ఇటీజ్‌నేచురల్. వాళ్ళు కలిస్తే మీరు పుట్టారు అంతమాత్రంచేత తల్లీదండ్రులను పూజిస్తారేంటీ.... పాడు అనేసరికి వారిని ఓల్డేజిహోముల్లో వదిలేస్తున్నాం.

ఛీఛీ పళ్ళు తోముకోవటానికి వేపపుల్లలు, ఉప్పు వాడతారా...అనాగరికులు...అనేసరికి ఉప్పు, వేపపుల్లలు, ఉత్తరేణిపుల్లలు మానేసి పేస్ట్ బ్రెష్‌లు వాడటం మొదలెట్టాం. ఇప్పుడు మీ పేస్టులో వేపగుణాలు ఉన్నాయా? మీ పేస్టులో ఉప్పు ఉన్నాదా? అంటుంటే వెఱ్ఱిముఖాలతో తల ఊపేస్తున్నాం... ఛీఛీ సికాకాయి, కుంకుడుకాయి, ఆముదం, మందారతైలాలు వాడుతారా అనేసరికి అవన్నీ మానేసి షాంపోలు అలవాటు చేసుకున్నాం. ఇప్పుడు మీ బట్ట తలపైన జుట్టు మొలిపిస్తాం అంటున్నారు... గ్రేట్ కదూ.

పిల్ల అందము, గుణములు, ఎత్తులావు, కన్నూముక్కు, మొఖము, పెదవులు, చెవులు, గూని, నడక, గాత్రము, ఇవన్నీ పరిశీలించి, పిల్ల తల్లిదండ్రుల చరిత్ర, తాతముత్తాతల, మేనమామ, మేనత్తల చరిత్ర వంశ చరిత్ర ఇవన్నీ చూసి పిల్ల గుణాలు గణాలు. తారాబలం, చంద్రబలం యోని పొంతనము నాడీపొంతనము రాశిపొంతనము అన్నీ చూసి వధూవరులకు తగిన బలమైన ముహూర్తం లభించేదాకా ఆగి కట్నాలుకానుకలతో అనేకమంది బంధుమిత్రుల, పండుముత్తైదువల నిండు దంపతుల ఆశీస్సులు సలహాలతో....

ఆమ్మో!... మీ పెళ్ళిళ్ళకి ఇంత తతంగమా... మా పెళ్ళిళ్ళుచూడండి, చక్కగా పిల్లపిల్లాడికి, పిల్లాడికి పిల్లనచ్చితేచాలు. వెంటనే వెళ్ళి ఉంగరాలు మార్చుకుని నడిరోడ్డులోనైనా సిగ్గులేకుండా ముద్దులు పెట్టేసుకుంటాం. ఒకళ్ళమీద ఒకళ్ళకి మోజు తీరిపోతే ఈజీగా విడిపోయి ఎవరికి వారు వేరే పెళ్ళిళ్ళుచేసుకుంటాం. మీకు పెళ్ళిచేసుకునే అధికారం మాత్రమే ఉంది. విడిపోయే అధికారం లేదు. అనేసరికి...

ఇదేదో బాగుందనుకొని వావివరుసలు, వయస్సు, కుల గోత్రాలు పట్టించుకోకుండా మైనార్టీ తీరితేచాలు తల్లిదండ్రులగుండెల మీద తన్ని చెప్పాపెట్టకుండా ఇల్లు వదిలిపారిపోయి ఫ్రెండ్స్‌ని అడ్డం పెట్టుకొని దండలు మార్చుకొని దిక్కులేని బతుకులు బతికెయ్యటానికి మెల్లిగా అలవాటు పడుతున్నాం. తాచెడ్డకోతి వనమెల్లచెరచెనన్నట్టు ఎవరన్నా ఎదురుపడితే ఎంతో స్టైల్‌గా మీది అరేంజిడ్ మ్యారేజా లవ్ మ్యారేజా, రీమ్యారేజా అని మనంచేసిన వెధవపనిని సమర్థించుకోవటం కూడా మనకి తెలిసిపోయింది.

అబ్బా! వెరీగుడ్ ఇప్పుడు మీరు మాలాగానే చాలా విషయాలు నేర్చుకున్నారు.

కానీ....ఆచారాలు కట్టుబాట్లు నియమాలు నదీస్నానాలు, పుణ్యక్షేత్రాలు, పూజా పునస్కారాలు, తల్లీతండ్రీ గురువుదైవము. వేదము పురాణము ఉపనిషత్తులు బ్రహ్మసూత్రములు గుళ్ళు, గోపురాలు పితృదేవతలు శ్రాద్ధాలు తర్పణాలు, బ్రాహ్మణ పూజ, గోపూజ, తులసి, మారేడు, రావి, మఱ్ఱి, జువ్వి, పాలాశ, వేపచెట్లపూజలు, దానము, ధర్మము, దయ, పాత్రత, శీలము, నీతి, నైతికవిలువలు, ఇట్లాంటి బూజు పట్టిన ఎప్పుడో మధ్యయుగంనాటి అనాగరిక పద్ధతులను ఇంకా కొనసాగిస్తున్న హిందూమంతంలో ఉంటారా! ఛీఛీ!...అనగానే... నిజమేకదా అనిపించి మెల్లగా హిందూమతాన్ని వదిలే ప్రయత్నం చేస్తున్నాము.

వ్హా! వాట్ ఎగ్రేట్ గ్లోబలైజ్‌డ్ సివిలైజ్‌డ్ కల్చర్ కదా...!  

జై శ్రీరామ్
జై హనుమాన్

  1. బృహస్పతి భార్య తారకు బృహస్పతి శిష్యుడైన చంద్రుడికి పుట్టినవాడు బుధుడు. మనువుకుమారుడైన సుద్యుమ్నుడు ఒక కొలనులో స్నానము చేయగా స్త్రీగా మారిపోయెను ఆమె పేరు ఇల. ఆమెను బుధుడు చూచి వివాహమాడెను. వారిరువురకు కలిగిన కుమారుడు పురూరవుడు. బృహస్పతి నవగ్రహాలలో ఒక గ్రహం. తార అనేది నక్షత్రం బుధుడు నవగ్రహాలలో ఒక గ్రహం. ఆ బుధుడి కుమారుడు మాత్రం మనిషే షట్చక్రవర్తులలో ఒకడైన పురూరవుడు. నమ్మబుద్ధికావటం లేదు కదూ.... కానీ అదే నిజం.
  2. స్వధ కూతురు మేనక. ఆ మేనకను హిమవంతుడు వివాహమాడెను. మేనకా హిమవంతులకు పార్వతి పుట్టి తపస్సు చేసి శివుని మెప్పించి వివాహమాడెను. హిమవంతుడంటే హిమాలయ పర్వతములు. ఈ పర్వతములు పితృదేవతల కూతురైన మేనకను వివాహమాడటం వారికి సంతానంగా పార్వతి పుట్టటం శివుణ్ణి పెళ్ళి చేసుకోవటం అంతా తమాషాగా ఉందా. కానీ అదే నిజం.
  3. మన వేదాలూ పురాణాలూ వట్టి పుక్కిటి పురాణాలని పసలేనివని కాలక్షేపం కోసం రచించినవనీ మనచేతనే పలికించగలిగిన పాశ్చాత్య దేశాల విద్యావిధానములు భారతీయ సంస్కృతిని చరిత్రను పురాణాలను ఇతిహాసాలను పరిహాసం చేస్తుంటే ఆత్మాభిమానం కోల్పోయి మనకన్నా వారే గొప్ప అని భావించే వారందరికీ ఒక విజ్ఞప్తి. ఒకసారి డిసెంబరు 6 వ తేది. 2010 సోమవారం నాటి ఈనాడు దిన పత్రికలో వచ్చిన ఒక వార్తను చదవండి. హెడ్డింగ్:- ప్లాస్మా ఆవిష్కరణ.

ఈ అనంత విశ్వంలోని నక్షత్రాలు, గ్రహాలు సూర్యచంద్రులు, పర్వతాలు, భూమ్మీద జీవులుగా ఎలామారారో తెలియక ఆశ్చర్యపోతూ తమ పరిశోధనలను కొనసాగిస్తున్న పాశ్చాత్యదేశపు శాస్త్రజ్ఞులను చూస్తే జాలేస్తోంది. ఇంతకాలం మనల్ని మన పురాణాలను మన ఆచారాలను హేళన చేస్తూ ఆటపట్టించిన ఈ పాశ్చాత్య దేశపు శాస్త్రజ్ఞులు అవే నిజమని తమ పరిశోధనల ద్వారా తెలుసుకొని ఆశ్చర్యపోతున్నారు. పైన చెప్పిన విషయాలన్నీ పచ్చి నిజాలు. అవే కాదు ఇంకా కూడా చూడండి.

జరాసంధుని బారి నుండి యాదవులను రక్షించుటకై కృష్ణుడు 5200 సంవత్సరాల క్రితమే సముద్రంలో అద్భుతమైన భవనాలతో రాతి కట్టడాలతో ఒక నగరాన్నే నిర్మించటం వీళ్ళు చెబుతున్న సైన్సుతోనో, టెక్నాలజితోనో కాదు. వేద విజ్ఞానంతో. నాసావాళ్ళు తమ ఉపగ్రహాలతో సముద్ర గర్భంలోని ఈ మహానగరాన్ని గుర్తించి, అప్పటికే మనకున్న విజ్ఞానానికి ఆశ్చర్యపోతున్నారు....చుట్టు పక్కల ఎక్కడా కూడా కొండలు బండలు లేని ప్రాంతమైన రామేశ్వరం వద్ద పెద్ద పెద్ద బండలతో సముద్రపు ఈకొననుండి ఆకొనవరకు ఏకంగా వారధినే కట్టించిన శ్రీరామ చంద్రమూర్తి వీళ్ళ సైన్సు టెక్కాలజీలు చదువలేదు. వేదాధ్యయనమే చేశారు.

శ్లో|| అంబితమే నదీతమే దేవితమే సరస్వతి| అప్రశస్తాఇవశ్మసి ప్రశస్తిమ్ అంబనస్కృథి|| సరస్వతి నదిని స్తుతిస్తున్న మంత్రమిది.

ఋగ్వేదంలో సుమారుగా 50 చోట్ల సరస్వతీనది ప్రస్తావన ఉంది. కానీ అటువంటి నది ఏదీ భూమ్మీద ఏనాడూ కూడా లేదనీ, పురాణాల్లోని విషయాలన్నీ అసత్యాలనీ, మనల్ని ఇంతకాలం హేళన చేసినవారు ఈనాడు నాసావారు చెప్తున్న విషయాల్ని విని నోళ్ళు మూసుకున్నారు. నాసావారు చెప్పాక ఇస్రోవారు కూడా పరిశోధించి సరస్వతీనది ఒకటి ఉండేదనీ అది పురాణాల్లో చెప్పినట్లుగానే 14 మైళ్ళ వెడల్పుతో ప్రవహించేదనీ ఏ కారణం చేతనో భూమ్మీద నుండి మాయమై అంతర్వాహినిగా భూగర్భంలో ప్రవహిస్తున్నదని తెలియజేశారు. ఈ సరస్వతీ నదీ జలాలను పైకి తేగలిగితే రాజస్థాన్‌లోని ఎడారి ప్రాంత మంతా సస్యశ్యామలంగా మారిపోతుందని సైంటిస్టులు చెప్తున్నారు.
(సశేషం...)
డిసెంబరు 6 వ తేది. 2010 ఈనాడు దినపత్రికలో వచ్చిన వార్త.

 
సేకరణ: గచ్చిబౌళిలోని వినాయకనగర్‌లో వెలసిన శ్రీ పద్మావతి వేంకటేశ్వర స్వామి దేవస్థానం వారు పంచిన కఱపత్రం నుంచి.

జై శ్రీరామ్
జై హనుమాన్
నిండా నూరేళ్ళు బ్రతికి సర్వవిధాల ఉన్నతిని సాధింపదగిన మనుష్యుడు అల్పాయుష్కుడై అకాల మరణం వాత పడుతున్నాడు. మరణమైనా కొంతమేలేగాని కొందరు జీవించినంత కాలం రోగ పీడితులై తమకు, తోటి వారికి కూడా భరింపరాని రీతిలో జీవింపగల్గుతున్నారు. "ఎప్పుడు ప్రాణం పోతుందా" అని ఎదురు చూచే స్థితికి కూడా వస్తున్నాడు. ఇహమునకు, పరమునకు కొరగాని పాడుజన్మను నిందించుకొనుట తప్ప అట్టి వారు చేయగలదిలేదు. సదాచార సంపద సాధిస్తే వారికీదురవస్థ ఏపడదు. చతుర్విధ పురుషర్థ సాధనే జీవిత లక్ష్యం. "ధర్మార్థ కామ మోక్షాణాం మూలముక్తం కళేబరం" అని అన్నిటికీ ఈ దేహమే మూలం కాబట్టి దీని రక్షణను సత్త్వ మార్గంలో జ్ఞాన మోక్షములకు అర్హమగునట్లు చూచుకొనాలి. ఇది ఐహిక భోగాన్నికోరుకొనేవారికే కాదు శరీరాన్ని అశాశ్వతంగా తలచే వేదాంతులకైనా తప్పదు. అందుకే "సర్వ మన్యత్ పరిత్యజ్య శరీర మనుపాలయేత్" అని అగ్నివేశముని అన్నిటినీ వదలి ముందు శరీరాన్ని రక్షించుకోమన్నాడు. "బలవర్ధకాహారాలు, కావలసినన్ని మందులతో శరీరాన్ని కాపాడుకోవచ్చుకదా!" అని ప్రశ్నింపవచ్చు. అలా కాపాడుకొనే దేహం ఇహానికే తప్ప పరానికి పనికి రాదు. సార్థక జన్మ కాదు. అలా జన్మ సార్థకత సాధించుకొనటానికి ఏకైక మార్గం సదాచారం. ఆ మార్గంలో నడచిన శరీరం మాత్రమే పురుషార్థ సాధకమైన హైందవ పవిత్ర శరీరం కాగలదు. సదాచారం వలన సమస్తము చేకూరుతాయి. మను ధర్మ శాస్త్రం "ఆచారా ల్లభతే హ్యాయు: - ఆచారా దీప్సితా: ప్రజా:| ఆచారా ద్ధన మక్షయ్యం - ఆచారో హం త్యలక్షణం|| అని సదాచారం వలన ఆయుర్ధాయం పెరుగుతుందని, సత్సంతానం లభిస్తుందని, తరగని సంపద చేకూరుతుందని, దుర్లక్షణాలన్నీ తొలగిపోతాయని చెప్తోంది. అది నిజం. సదాచార పరుడు అకాల మృత్యువు వాత పడడు. "అకాల రతి క్రియల వల్ల దుర్జనులు పుడతా"రని శాస్త్రం చెప్పింది. ఆ విషయం "సంధ్యా సమయంలో సంభోగం చేసినందువల్ల విశ్వవో బ్రహ్మ సంతానం రావణ కుంభకర్ణాదులు రాక్షసులయ్యా"రని పురాణం నిరూపిస్తోంది. అలా కాక సదాచార పరులైతే వారికి తప్పక సత్సంతానమే కలుగుతుంది. లోకంలో పుట్టే దుర్మార్గుల జన్మలకి ఇలాటి సదాచార లోపమే మూలం. "ఆరోగ్యమే మహాభాగ్య"మన్నట్లు సదాచారం చే దుర్వ్యయాలు లేక సంపద నిలచి ఉంటుంది. ఇక్కడ ఆచారమంటే అనర్థదాయకమైన మూడాచారం కాదు. ఆ మూడాచారం దు:ఖ హేతువు. సదాచార ధర్మాలు ఎప్పుడూ మానవులకు సుఖశాంతులనే ప్రసాదిస్తాయి. అందుకే "సుఖార్థా: సర్వభూతానాం - మతాః సర్వాః ప్రవృత్తయః | సుఖం చ న వినా ధర్మః - తస్మాత్ ధర్మ పరో భవ |" అని ప్రాణులకు సుఖ సంపాదకములుగానే మన మత ధర్మాలు ఏర్పడ్డాయి. మూఢాచారంతో స్నాన, అన్న, పానములు అక్రమంగా చేసి ధర్మాన్ని నిందించడం తగదు. ఒక డాక్టరు గారు స్వయంగా చెప్పిన సంఘటన ఇది. ఒకామె వ్యాధి గ్రస్తురాలైంది. శిరస్నానం తగదని చెప్పినా వినక అలాగే చేస్తూ దేవుళ్ళకు మ్రొక్కేది. వ్యాధి నయం కాలా. కొన్నాళ్ళకు బొట్టు లేకుండా కనబడి "క్రైస్తవమతం తీసుకున్నాక జబ్బు తగ్గిందండి" అంది. డాక్టరుగారు "ఇప్పుడు శిరఃస్నానం చేస్తున్నావా? అనడిగితే లేదంది. నేను చెప్పినట్లుగా చేసి ఉంటే మతం మారకపోయినా జబ్బు తగ్గి ఉండేది. నీ రోగం తగ్గడానికి కారణం మతం మార్పు కాదు. ఆచరణలో మార్పు అన్నారట ఆ డాక్టరు గారు. అలా మూఢాచారాలు కూడా మన ధర్మానికెంతో అపకారం చేస్తున్నాయి. హేతుబద్ధంగా సుఖశాంతులను కలిగించేదే మన సదాచారం అంతా. అలాకాని దశలో అన్నీ మూఢాచారాలుగానే పరిగణింపబడతాయి. కాబట్టి యోగ్యమగు ఆచారమే నిల్పి ధర్మాన్ని రక్షించాలి, శ్రౌత, స్మార్త కర్మలు చేయలేని వారికి సదాచారమే ఆ లోటు తీర్చగలది. 

(సశేషం...)

ఓం శ్రీరామ
జయ హనుమాన్

జంతూనాం నరజన్మ దుర్లభం అంటే ప్రాణ కోటిలో మనుష్య జన్మ లభించటం గొప్ప అదృష్టం అని మహనీయులు చెప్తుండగా లోకంలో ఎందుకు బ్రతుకుతున్నామో, ఎందుకు బ్రతకాలో తెలియని వారే అనేకులు కనబడుతున్నారు. విజ్ఞుడైన మనుష్యుడు ఇహమున ధర్మ, భోగాలని; పరంలో ముక్తిని సాధించటం కోసం బ్రతుకుతాడు. జన్మ సార్థకం అవడానికి ఏది సాధించాలన్నా ఉత్తమ మార్గం ధర్మాచరణ. అట్టి ధర్మాన్ని ఆచరించటానికి ప్రధాన సాధనం ఈ శరీరమే. అందుకే "శరీర మాద్యం ఖలు ధర్మసాధనం" అని ఋషులచే పేర్కొనబడింది. కాబట్టి ధార్మికుని ప్రథమ కర్తవ్యం అటువంటి ధర్మ సాధనమైన శరీరాన్ని రక్షించుకొనటమే. ఏదైనా సాధించాలంటే సాధనం బాగుండాలి. తుప్పు కట్టిన కత్తితో యుద్ధం చేయలేడు. కాబట్టి యుద్ధానికి వెళ్ళేవాడు సాధనమైన కత్తికి పదును పెట్టుకోవాలి. ప్రయాణానికి సాధనం వాహనం. ప్రయాణం చేయదల్చుకొన్నవాడు వాహనాన్ని బాగుచేసుకొనాలి. అలాగే ధర్మకార్యం చేయాలన్నా ముక్తిని పొందాలన్నా సాధనమైన శరీరాన్ని అనుకూలంగా సిద్ధం చేసికొనాలి. ఆ లక్ష్యంతో మనకు మహర్షులు అందించిన మార్గమే సదాచారం. సదాచారం వలననే మంచి బుద్ధిని, బుద్ధిననుసరించి నడువగల్గినట్లు శరీరాన్ని దిద్ది తీర్చుకోగల్గుతాము.

ప్రపంచ విఖ్యాత పండితుడు మాక్సుముల్లరు తమ అంతిమ దశలో భగవంతుని ప్రార్థిస్తూ తాను మరల పుడితే భారతదేశంలో పుట్టాలని కోరుకున్నాడట. ఇక్కడ పుట్టిన వారికా విలువ తెలియక ఈ పుణ్యభూమిని నిందిస్తున్నారు. ఆ పండితుడు అలా అనుకోవడానికి ప్రధానకారణం ఇక్కడి ఉత్తమ జీవన విధానం. సదాచార పూర్ణమైన జీవన విధానం. ఈ భారతీయుల జీవితంలోని ప్రధాన జీవం సదాచారమే అనే సత్యాన్ని గ్రహించిన నాడు వ్యక్తికి గాని, ఈ సమాజానికి గాని ధన్యత చేకూరి తీరుతుంది.

(సశేషం...)

శ్రీకంఠ 
జ్వాలో గ్రస్సకలామరాతిభయదః క్ష్వేళఃకఠంవా త్వయా
దృష్టః కించ కరే ధృతః కరతలే కిం పక్వజంభూఫలమ్।
జిహ్వాయాం నిహితశ్చసిద్ధఘటికా వా కంఠదేశే భృతః
కింతే నీలమణి ర్విభూషణమయం శంభోమహాత్మ న్వద॥

శ్రీకంఠా! శివా! సముద్రమధనవేళ ఉద్భవించిన విశ్వభయంకర విషజ్వాలలను నీసుకుమార నేత్రాలు ఎలావీక్షించగలిగాయి!  శంకరా! ఆవిషజ్వాలలను నీసుకుమార కరాలు ఎలా తాకి పట్టుకోగలిగాయి! చంద్రశేఖరా! దుర్భరమైన ఆకాలకూటవిషాన్ని నీనాలుక ఎలాసహించగలిగింది! అదేదో బెల్లపు‌ ఉండవలె, నేరేడుపండువలె, నోట్లోవేసుకుని చప్పరిస్తున్నావంటే అత్యాశ్చర్యకరం! నీమహిమ వర్ణనాతీతం.

భక్తసులభ
 నాలంవా సకృదేవ దేవ భవత స్సేవానతిర్వా నుతిః
పూజావాస్మరణం కథా శ్రవణమప్యాలోకనం మాదృశామ్।
స్వామి న్నస్థిరదేవతానుసరణాయాసేన కిం లభ్యతే
కావా ముక్తిరితః కుతో భవతిచే త్కిం ప్రార్థనీయం తదా॥

స్వామీ! నీవెంత దయామయుడివి తండ్రీ! నీనామమాహాత్మ్యం ఎంత అని ఎవరు గుర్తింపగలరు? ఒక్కసారి నీనామం ఉచ్చరించినంతమాత్రాన ఎట్టిపాపికైనా పాపాలన్నీ పోగొట్టి పరమపదం ప్రసాదిస్తావు. ఇందుకు అజామీళాదులు సాక్ష్యం.
నీకథలలో ఒక్కటి శ్రద్ధగా శ్రవణం చేసినా చాలు, ఎట్టిమూఢుడికైనా మోక్షం ఇస్తావు. ధృవుడు, తిన్నడు ఇది తెలియజేశారు. ఒక్కసారి అభిషేకం చేసినదానికే హస్తిరాజుకు అపవర్గం అందించావు.

వీరమణి 
కిం బ్రూమ స్తవసాహసం పశుపతే కస్యాస్తిశంభో భవ
ద్ధైర్యంచే దృశమాత్మనస్స్థితిరియం చాన్యైః కథంలభ్యతే।
భ్రశ్యద్దేవగణం త్రసన్మునిగణం నశ్యత్ప్రపంచం లయం
పశ్య న్నిర్భయ ఏకఏవ విహరత్యానంద సాంద్రోభవాన్॥

శివా! రుద్రా! నీవెంత ధైర్యశాలివి, వీరాధివీరుడవయ్యా! ప్రళయకాలంవచ్చి లోకాలు భస్మమయ్యే విస్ఫులింగ జ్వాలాకీలలురేగి, అందు దేవాదులుపడి మలమలమాడి మసైపోతుంటే, ఆవిలయజ్వాలలుచూచి మహాసంయమీంద్రులు సైతం ధైర్యంకోల్పోయి సమాధిస్థితివీడి గడగడ వణికిపోతుంటే, బ్రహ్మాండాలు భాండాలవలె దొర్లి భగభగమండి అగ్నిగోళాలై పఠేలున పగిలి విచ్చిపోతుంటే ఆప్రళయాగ్ని శిఖలలో విశ్వమంతా భస్మమైపోతుంటే, అమరాథినాథులు హడలిపోయి ప్రాణాలు చేతిలోపట్టుకుని పరుగుపెడుతుంటే
నీవు ఒక్కడివిమాత్రం మహాధైర్యంగా నిర్భయంగా వీరవిహారం చేయసాగావు. నీసాహసం, నీధైర్యం, నీస్థైర్యం, నీశౌర్యం ఎవరు ఎంత వర్ణించగలరు? నీకిదే నమోవాకాలు.

దర్శనం 
త్వత్పాదాంబుజ మర్చయామి పరమం త్వాం చింతయామ్యన్వహం
త్వామీశం శరణం వ్రజామి వచసా త్వామేవ యాచేవిభో।
వీక్షాం మే దిశ చాక్షుషీం సకర్ఉణాం దివ్యైశ్చిరం ప్రార్థితాం
శంభో లోకగురో మదీయ మనసః సౌఖ్యోపదేశం కురు॥

దేవేంద్రపూజితా! నీపాదపద్మాలు నిత్యం అర్చిస్తున్నాను. బ్రహ్మాది దేవసేవితా! నీదివ్యరూపం చిత్తంలో నిత్యం ధ్యానిస్తున్నాను. విష్ణుదేవవినుతా! నిర్మలమతితో నీకథాశ్రవణం నియతితో చేస్తున్నాను. కవీంద్ర సంసేవితా! నీచరణ నీరజాలు శరణాలని నిత్యం వేడుకుంటున్నాను.
సదుపదేశాలుచేసే జగద్గురూ! దేవముని సిద్ధ సాధ్యాదులు అర్థించే నీదర్శన స్పర్శన భాషణానుగ్రహాలు అందించి నన్ను కరుణించు కారుణ్యమూర్తీ! నీకు శతకోటి అభివందన నందన చందనాలు.

ఏమి అర్పింతు 
వస్త్రోద్ధూతవిథౌ సహస్రకరతా పుష్పార్చనే విష్ణూతా
గంధే గంధవహాత్మతాన్నపచనే బర్హిర్ముఖాద్యక్షతా।
పాత్రే కాంచన గర్భతాస్తిమయిచే ద్బాలేందు చూడామణే
శుశ్రూషాం కరవాణి తే పశుపతే స్వామిన్ త్రిలోకీ గురో॥

పశుపతీ! త్రిలోకైకపతీ! శివా! దిగంబరా! వ్యాఘ్రచర్మాంబరా! నీకు వస్త్రయుజ్ఙ్మం సమర్పించాలి అంటే వేయిచేతులు కావాలి. వేయిచేతులవేల్పు సూర్యుడే నీకు సమర్థుడు. చంద్రకళాధరా! కళార మనోహరా! నీకుపూజ చేయాలంటే సహస్రకమలాలు కావాలి. కమలలోచనుడైన విష్ణువే సంపాదింప సమర్థుడు. ఒకటి తక్కువైతే తనకంటినేఇచ్చి పూజ పరిపూర్తి చేసిన సమర్థుడు.
శ్రీకంధరా! నీకు పరిమళభరిత సుగంధరవ్యాలు సమర్పించాలి అంటే సదాగతిగల గంధవహుడైన వాయుదేవుడే సమర్థుడు. ప్రభూ! విషాహారా! నీకు సరసాన్నాలు నైవేద్యం హృద్యంగా పెట్టాలంటే అగ్నిదేవాదులకు అద్యక్షుడైన దేవేండ్రుడే సమర్థుడు. హవిర్భాగాలు అగ్నిద్వారా జలాదులు మేఘాలద్వారా సంపాదించి సమర్పింపగలరు. స్వామీ! బ్రహ్మాండసార్వభౌమా! నీకు అర్ఘ్యపాద్యాదులకు పాత్రలు సమర్పింప సర్వసృష్టికర్త అయిన బ్రహ్మదేవుడే సమర్థుడు. అతడు ఏదైనా సృష్టించి అర్పించగలడు.

పరమోపకారి
 నాలంవా పరమోపకారక మిదం త్వేకం పశూనాంపతే
పశ్యన్కుక్షిగతాన్ చరాచరగణాన్ బాహ్యస్థితాన్ రక్షితుమ్।
సర్వామర్త్య పలాయనౌషధ మతిజ్వాలాకరం భీకరం
నిక్షిప్తం గరళం గళేన గిశితం నోద్గీర్ణమేవ త్వయా॥

పరమశివా! పరమోపకారకా! లోకాలపై ఎంత జాలిగదయ్యా నీకు.
సముద్రమధనం జరుగుతుంటే మహాకాలకూటం నిప్పులుగ్రక్కుతూ పొంగిపొర్లివచ్చిందే. ఆభయంకర ఉద్ధృతదృశ్యం చూచి దేవతలందరూ ఇకప్రాణాలు నిలవవని భయపడూతుంటే ప్రాణాతురులైన వారిని రక్షించాలని ఈవిషం స్వీకరించావా! ఈవిషప్రభావం వలన లోపలిలోకాలు కాలిపోతాయని మింగలేదా! బయటిలోకాలు భస్మమైపోతాయని బయటికికక్కలేదా! లోకక్షేమంకోసం ఆవిషాన్ని క్రక్కలేక మ్రింగలేక పుక్కిటనే పట్టిఉంచావా దేవా! లోకాలకోసం ఎంతటికష్టాన్ని భరిస్తున్నావయ్యా! శంకరా! గరళకంఠా! సాయీశ్వరా! శతనమస్కారాలు.