ఇంద్రియాలు
మనప్తే పాదాబ్జే నివసతు వచః స్తోత్ర ఫణితౌ
కర శ్చాభ్యర్చాయాం శ్రుతిరపి కథాకర్ణనవిధౌ।
తవధ్యానే బుద్ధి ర్నయన యుగళం మూర్తివిభవే
పరగ్రంధైః కిం వా పరమ శివ జానే పరమతః॥
పరమశివా! సాయిదేవా! జ్ఞానస్వరూపా! నిర్థూతపాపా! నామనస్సు ఒకతుమ్మదయై నీపాదపద్మం వ్రాలి కర్ణికపై నిలిచి భక్తిమకరందాన్ని పానం చేస్తుండాలి. వాత్సల్యమూర్తీ! నావాక్కులు సుధాధారలై మధురభావల జాలులో ప్రవహించి నీపవిత్రస్తోత్ర సముద్రంలో లీనమై చరితార్థాలు కావాలి. మహైశ్వర్య ప్రదా! నాహస్తపద్మాలు నీ సమస్తోపచారాలతో పరిమళించి బాగుగా వికసించాలి.
నాగేంద్రభూషణా! నా కర్ణపుటాలు నానా మహిమాన్వితాలైన నీకథామృత ఫలాలు నిండుగా పట్టుకొని నిరంతరం ప్రకాశిస్తూ ఉండాలి. మహాదేవ! నామనస్సు సహస్రారవిందంలో సాంబమూర్తివై వెలుగొందే నిన్ను ధ్యానిస్తూండాలి. కామ్యదా! నా కన్నులలోని చూపు భ్రూమధ్యంలో నిలిచి నీఅనంతరూప వైభవాన్ని దర్శిస్తూండాలి
మోహజాలము
యథాబుద్ధి శ్ముక్తౌ రజతమితి కాచాశ్మని మణి
ర్జలే పైష్టే క్షీరం భవతి మృగతృష్ణాను సలిలం।
తథా దేవభ్రాంత్యా భజతి భవదన్యం జడజనో
మహాదేవేశం త్వాం మనసి చ సమత్వా పశుపతే॥
గిరిజామనోహరా! శంకరా! మానవులు పెక్కుభ్రమలలోపడి నిజవస్తుతత్వం తెలుసుకోలేక మాయావస్తువుల వెంబడి నశించిపోతున్నారు. మద మోహ మాత్సర్య మాయాగ్రస్తులైన మందమతులు భ్రమలోపడి సత్యం తెలుసుకోలేక పోతున్నారు. భోగలాలసులై క్షుద్రదేవతలను ఉపాసించి ముక్తిప్రదావతవైన నిన్నుమరచి అల్పసుఖాలకై అల్పులను ఆశ్రయిస్తున్నారు. అదేశాశ్వతం అనుకుని మురిసిపోతున్నారు. శివా! నిన్ను భజించినవారు నిరుపమాన నిర్మలానందం పొందుతారు.
ఆత్మపుష్పాలు
గభీరే కాపారే విశతి విజనే ఘోరవిపినే
విశాలే శైలేచ భ్రమతి కుసుమార్థం జడమతిః।
సమర్ప్యైకం చేతస్సరసిజ ముమానాథ భవతే
సుఖే నావస్థాతం జన ఇహ న జానాతి కిమహో॥
ఉమానాథా! సాయీశ్వరా! సత్యశివసుందర మహేశ్వరా! నీకు మానసాంబుజాలు సమర్పించలేని మందబుద్దులు బాహ్యపూజకై ఎంత ఆడంబరం చేస్తున్నారు. నీకు సహస్ర సారసార్చన చేయాలని, లోతైన సరోవరాల్లో దిగి, తీగలు తెంచి ఎన్నో తామరపూలు తెంచుకుని వస్తున్నారు. లక్షబిల్వార్చనకని అడవులలోకి వెళ్ళి లేతలేత మారేడుకొమ్మలను తెచ్చి గుట్టలు పోస్తున్నారు. క్షీరాభిషేకాలని లేగదూడల మూతులు బిగించి పాలన్నీ బానలకొద్దీ పిందుకవస్తున్నారు. పాపం! వారికి నీవు భావప్రియుడవనీ, ఆత్మారాధన అంటే ఇష్టమనీ తెలియదు.చెప్పినా వినిపించుకోరు. మానసోద్యానవనంలో పూచిన నాలుగు చిన్నిగుణాలనే పూలు నీకు సమర్పిస్తే నీవెంత సంతోషిస్తావో తెలియదు.
ఏకైక ఫలప్రదాత
సహస్రం వర్తంతే జగతి విబుధాః క్షుద్రఫలదాః
సమన్యే స్వప్నేవా తదనుసరణం తత్కృతఫలమ్।
హరిబ్రహ్మాదీనాం అపి నికటభాజా మసులభం
చిరంయాచే శంభో శివ తవపదాంభోజ భజనమ్॥
పరమశివా! దయాసముద్రా! అక్షయ వరప్రదాతా! భక్త చింతామణీ! కామధేనూ! నీపాదారాధన విడిచి అల్పఫలాలు ఇచ్చే క్షుద్రదేవతల పాదాలుపట్టి అర్థించలేను. భ్రమలోపడి మణులను వీడి గాజుపెంకులవెంట పరిగెత్తలేను. పాలు ఇచ్చే కామధేనువును కాదని గొడ్డుటావువెంట కుండగొని పోవలేను. హరిబ్రహ్మాదులకే లభ్యములుకాని నీపవిత్ర పాదపద్మాలు నాహృదయచక్రంలో నిలుపుకొని నిత్యం ధ్యానం చేసుకొంటాను. మహాదేవ! నన్ను దయజూడు. నీవు ఒక్కడవే శాశ్వతుడవు. నిన్నువేడుకుంటున్నాను. జీవన్ముక్తిని ప్రసాదించు.
పశువు
స్మృతౌ శాస్త్రేవైద్యే శకున కవితాగాన ఫణితౌ
పురాణే మంత్రే వా స్తుతి నటన హాస్యే ష్వ చతురః।
కథం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయి కోహం పశుపతే
పశుం మాం సర్వజ్ఞ ప్రధిత కృతయా పాలయవిభో॥
సర్వజ్ఞా! సర్వేశ్వరా! పరమశివా! పశుపతీ! నేను నిజంగా పశువునే. ఏమీ నేర్చుకోలేదు. ధర్మశాస్త్రాలను ఎరుగను. భాషావైదుష్యాలు లేవు. వైద్యవిద్య రాదు. శాస్త్రపాండిత్యమూ, సంగీతసాహిత్యాలు, పురాణాలు, మంత్రాలు ఏవీ తెలియవు. హాస్య శృంగారరస ప్రసంగాలు చేయటం చేతకాని పని. నీవు అన్నీ తెలిసినవాడవు. ధీనబాంధవుడవు. అనాథనాథుడవు. పశుతుల్యుండనైన నన్ను నీవేరక్షించాలి. నీవుకాదన్న వేరేదిక్కులేదు. అన్యధాశరణం నాస్తి త్వమేవ శరణం మమ.
శుష్కతర్కాలు
ఘటోవా మృత్పిండో౭ప్యరుణురపిచ ధూమోగ్నిరచలః
పటోవా తంతుర్వా పరిహరతి కిం ఘోరశమనమ్।
వృధా కంఠక్షోభం వహసి తరసా తర్కవచసా
పదాంబోజం శంభోర్బజ పరమసౌఖ్యం వ్రజసుధీః॥
ఓపండితులారా! ధీరాగ్రగణ్యులారా! హేతువాద తర్కాలు కేవలం కంఠశోషను ఫలంగా మిగులుస్తాయి. అవి మృత్యువును జయించేవికావు.ఆయుఃకాలం వ్యర్థంచేయకుండా తనువులో బలం ఉన్నప్పుడే మృత్యుంజయస్వామి పాదపద్మాలను ఆరాధించండి. ఆఈశ్వరనామ స్మరణమే నీకు మేలుచేయునది.
శ్రీసత్యసాయిబాబా కరుణాకటాక్షాలతో 'శాంతిశ్రీ' జంద్యాల వేంకటేశ్వరశాస్త్రిగారు జగద్గురు ఆదిశంకరాచార్య విరచితం శివానందలహరికి తెలుగులో అర్థాన్ని తెలుపుతూ గ్రంధం వెలువరించారు. కార్తీకమాసం సందర్భంగా ప్రతిరోజూ కొన్నిశ్లోకాలను ప్రచురించ సంకల్పించాను.
కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపః
ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతుమే।
శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృదిపున
ర్భవాభ్యాం ఆనంద స్పురదనుభవాభ్యాం నతిరియమ్॥
శివపార్వతులు సర్వకళా స్థానీయులు. శ్రీచక్ర విరాజితులు. వేదసాహితీ మూర్తులు. చంద్రుని కళలు శిరసులపై అలంకరించుకున్నారు. ఒకరి తపఃఫలాలను మరొకరు అందుకొనుచున్నారు. శబ్ధార్ధములవలె కలిసియున్నారు. భక్తుల భక్తికి తగినఫలాలు అనుగ్రహిస్తున్నారు. సర్వప్రాణికోటి ఆత్మపీఠాలపై శివశంకరులై ప్రకాశిస్తున్నారు. వారుసర్వసృష్టికి మంగళస్వరూపులు. ఆత్మవిద్యకు జ్యోతులు. అద్యాత్మభక్తులకు అనుభవానందము ప్రసాదించేవారు. అఖిలజగతికి జననీజనకులైన ఉమామహేశ్వరులకు నమస్సులు.
గాధాప్రవాహం
గళంతీశంభో త్వచ్చరిత సరితః కిల్బిషరజో
దళంతీ ధీకుల్యాసరణిషు పతంతీ విజయతామ్।
దిశంతీ సంసారభ్రమణ పరితాపోపశమనం
వసంతీ మచ్చేతో హ్రదభువి శివానందలహరీ॥
శంభో! మహాదేవా! జగత్పతీ! మేఘాలు జడలుగాగల శివా! భక్తుల ఆర్తి హరించేవాడా! పాపహరా! మహైశ్వర్యధుర్యా! విశ్వాత్మా సౌందర్యమూర్తీ! దేవప్రియా! భక్తజన కల్పకమా! నీచరితం అమృతప్రవాహం.పరమపావనం. శివానందలహరీ! ఇది నీహృదయక్షేత్రాన్ని పండించుకాక!
మహదేవుడు
త్రయీవేద్యం హృద్యం త్రిపురహర మాద్యం త్రినయనం
జటాభారోదారం చలదురగహారం మృగధరమ్।
మహాదేవం దేవం మయి సదనభావం పశుపతిం
చిదాలంబం సాంబం శివమతివిడంబం హృదిభజే॥
చిదాలంబా! సాంబా! నీఘనత వేదాలవల్లనే తెలుస్తుంది. నీరూపం మనోహరం. రాక్షసమాయాశక్తులకు నిలయాలైన త్రిపురాలను జయించావు. దానితో దేహభ్రాంతిని దూరంచేసిన వాడవైనావు. సృష్టికి పూర్వమే ఉన్నావు. సూర్యచంద్రాగ్నులు అనే మూడుమూల తేజస్సులను కన్నులుగా చేసుకున్నావు. ఆకాశమే నీకుజడలు. ఆజడలే నీకు కిరీటాలు. ఔదార్యమునకు నీది ఆచార్యపీఠం. ఫణిరాజులు మణిహారాలై నిన్నుసేవిస్తుంటాయి. అందమైన హరిణబాల చెలువం చిందిస్తుంటుంది. నీవు మహదేవుడవు. అమరులందరికీ అధిపతివి. నన్ను అత్యంత వాత్సల్యంతో చూచే దయామయుడవు. అనవరతం ఆనందం ప్రసాదించేవాడవు. పార్వతీపతివి. పశుపతివి. పరమపతివి. జ్ఞానమూర్తివి.శివుడవు. కళ్యాణమూర్తివి. నిన్ను సదా నాహృదయచంక్రంలో నిలిపి ఆరాధిస్తూ శివానందలహరిలో ఓలలాడుతుంటాను.
ధ్యానమ్
పీతం వాసో వసానం నవకమలదళస్పర్థి నేత్రం ప్రసన్నమ్।
వామాంకారూఢసీతాముఖకమలమిళల్లోచనం నీరదాభం
నానాలంకారదీప్తం దధతమురు జటామండలం రామచంద్రమ్॥
చరితం రాఘునాథస్య శతకోటి ప్రవిస్తరమ్।
ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనమ్॥
ధ్యాత్వానీలోత్పలశ్యామం రామం రాజీవలోచనమ్।
జానకీ లక్ష్మణోపేతం జటామకుట మండితమ్॥
సాసితూణధనుర్భాణ పాణిం నక్తంచరాంతకమ్।
స్వలీలయా జగత్త్రాతు మావిర్భూత మజం విభుమ్॥
రామరక్షాం పఠేత్ ప్రాజ్ఞః పాపఘ్నీం సర్వకామదామ్।
శిరో మే రాఘవః పాతు ఫాలం దశరథాత్మజః॥
కౌసల్యేయో దృశౌ పాతు విశ్వామిత్రప్రియః శ్రుతీ।
ఘ్రాణం పాతు మఖత్రాతా ముఖం సౌమిత్రివత్సలః॥
జిహ్వాం విద్యానిథిః పాతు కంఠం భరతవందితః।
స్కందౌ దివ్యాయుధః పాతు భుజౌ భగ్నేశకార్ముకః॥
కరౌ సీతాపతిః పాతు హృదయం జామదగ్న్యజిత్।
మధ్యం పాతు ఖరద్వంసీ నాభిం జాంబవదాశ్రయః॥
సుగ్రీవేశః కటిం పాతు సక్థినీ హనుమత్‌ప్రభుః।
ఉరూ రఘూత్తమః పాతు రక్షఃకులవినాశకృత్॥
జానునీ సేతుకృత్ పాతు జంఘే దశముఖాంతకః।
పాదౌ విభీషణశ్రీదః పాతు రామో౭ఖిలం వపుః॥
ఏతాం రామబలోపేతం రక్షాం యః సుకృతీ పఠేత్।
స చిరాయుః సుఖీపుత్రీ విజయీ వినయీ భవేత్॥
పాతాల భూతల వ్యోమచారిణః చద్మచారిణః।
నద్రష్టుమపి శక్తాస్తే రక్షితం రామనామభిః॥
రామేతి రామభద్రేతి రామచంద్రేతి వా స్మరణ్।
నరో న లిప్యతే పాపైః భుక్తిం ముక్తించ విందతి॥
జగజ్జైత్రైక మంత్రేణ రామనామ్నాభిరక్షితమ్।
యః కంఠే ధారయేత్ తస్య కరస్థాః సర్వసిద్ధయః॥
వజ్రపంజరనామేదం యో రామకవచం స్మరేత్।
అవ్యాహతాజ్ఞః సర్వత్ర లభతే జయమంగళమ్॥
ఆదిష్టవాన్ యథా స్వప్నే రామరక్షామిమాం హరః।
తథాః లిఖితవాన్ ప్రాతః ప్రబుద్ధో బుధకౌశికః॥
ఆరామ@ కల్పవృక్షాణాం విరామః సకలాపదామ్।
ఆభిరామస్త్రిలోకానాం రామః శ్రీమాన్ స నః ప్రభుః॥
తరుణౌ రూపసంపన్నౌ సుకుమారౌ మహాబలౌ।
పుండరీక విశాలాక్షౌ చీరకృష్ణాజినాంబరౌ॥
ఫలమూలాశినౌ దాన్తౌ తాపసౌ బ్రహ్మచారిణౌ।
పుత్రౌ దశరథస్యైతౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ॥
శరణ్యౌ సర్వసత్తానాం శ్రేష్టౌ సర్వధనుష్మతామ్।
రక్షఃకుల నిహన్తారౌ త్రాయేతాం నో రఘుత్తమౌ॥
ఆత్తసజ్జధనుషా విషస్పృశావక్షయాశుగనిషంగసంగినౌ।
రక్షణాయ మమ రామలక్ష్మణావగ్రత పథి సదైవ గచ్చతామ్॥
సన్నదః కవచీ కడ్గీ చాపబాణధరో యువా।
గచ్చన్మనోరథాన్నశ్చ రామః పాతు సలక్ష్మణ॥
రామో దాశరథీ శ్శూరో లక్ష్మణానుచరో బలీ।
కాకుత్‌స్థః పురుషః పూర్ణః కౌసల్యేయో రఘూత్తమః॥
వేదాన్తవేద్యో యజ్ఞేశః పురాణపురుషోత్తమః।
జానకీవల్లభః శ్రీమానప్రమేయః పరాక్రమః॥
ఇత్యేతాని జపన్నిత్యం మద్భక్తః శ్రద్ధయాన్వితః।
ఆశ్వమేధాధికం పుణ్యం సంప్రాప్నోతి న సంశయః॥
రామం దూర్వాదళశ్యామం పద్మాక్షం పీతవాసనమ్।
స్తువంతి నామభిర్దివ్యైః న తే సంసారిణో నరాః॥
రామం లక్ష్మణపూర్వజం రఘువరం సీతాపతిం సుందరం
కాకుత్‌స్థం కరుణార్ణవం గుణనిథిం విప్రప్రియం ధార్మికమ్।
రాజేంద్రం సత్యసంధం దశరథతనయం శ్యామలం శాంతమూర్తిం
వందే లోకాభిరామం రఘుకులతిలకం రాఘవం రావణారిమ్॥
రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేథసే।
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః॥
శ్రీరామ రామ రఘునందన రామ రామ
శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ।
శ్రీరామ రామ రణకర్కశ రామ రామ
శ్రీరామ రామ శరణం భవ రామ రామ॥
శ్రీరామచంద్రచరణౌ మనసా స్మరామి
శ్రీరామచంద్రచరణౌ వచసా గృణామి।
శ్రీరామచంద్రచరణౌ శిరసా నమామి
శ్రీరామచంద్రచరణౌ శరణం ప్రపద్యే॥
మాతా రామో మత్పితా రామచంద్రః
స్వామీ రామో మత్సఖా రామచంద్రః।
సర్వస్వం మే రామచంద్రో దయాళుః
నా౭న్యం జానే నైవ జానే న జానే॥
దక్షిణే లక్ష్మణో యస్య వామే చ జనకాత్మజా।
పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనమ్॥
లోకాభిరామం రణరంగధీరం।
రాజీవనేత్రం రభువంశనాథమ్।
కారుణ్యరూపం కరుణాకరం తం।
శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే॥
కూజంతం రామరామేతి మధురం మధురాక్షరమ్।
ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలమ్॥
ఆపదామపహప్తారం దాతారం సర్వసంపదామ్।
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్॥
భర్జనం భవబీజానాం ఆర్జనం సుఖసంపదామ్।
తర్జనం యమదూతానాం రామరామేతి గర్జనమ్॥
రామో రాజమణిః సదా విజయతే రామం రమేశం భజే
రామేణాభిహతా నిశాచరచమూ రామాయ తస్మై నమః।
రామాన్నాస్తి పరాయణం పరతరం రామస్య దాసో౭స్మ్యహం
రామే చిత్తలయః సదా భవతు మే భో రామ! మాముద్ధరః॥
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే।
సహస్రనామతత్ తుల్యం రామనామవరాననే॥
రాయిలోనూ జీవశక్తి ఉన్న విషయం సైన్సు అంగీకరిస్తుంది. పదార్థాలన్నీ అణు నిర్మితాలే. అణువులో పరమాణువులు ఉంటాయి. పరమాణువులో కేంద్రకం అనగా న్యూక్లియస్ ఉండి, దానిలో ధనావేశిత ప్రోటాన్లు, న్యూట్రాన్లు, వానిచుట్టూ నిర్దిష్ట క్రమంలో తిరిగే ఋణావేశిత ఎలక్ట్రానులు ఉంటాయనేది సైన్సు చెపుతున్న సత్యం. నిరంతరం భ్రమించే సూక్ష్మాణువులు ఉన్నపుడు, శిలలు జీవంలేనివని ఎలా అనగలం? భగవంతుడు సర్వాంతర్యామిగా అందరూ అంగీకరిస్తారు. కాబట్టి ప్రతిమ యందూ భగవంతుడున్నట్లే. కాగా ఆ దైవత్వ ఉనికిని ప్రతిష్ఠా కలాపం ద్వారా మంత్ర యంత్ర తంత్ర శక్తులచే అందు పూర్ణమూ, స్థిరమూ చేయడం జరుగుతుంది. "మంత్రాధీనంతు దైవతం" కాన అలానే సాధ్యం. నిత్యనైమిత్తిక పూజాదికంచే ఆ కేంద్రీకృత దైవశక్తి క్రమాభివృద్ధితో జనాకర్షకమై భక్తుల కోర్కెలు తీర్చుతూ వారి అజ్ఞానాంధకారం క్రమంగా తొలగిస్తూ ఉంటుంది. భావనాశక్తివలన స్థూలదృష్టికి కన్పడే జడ శిలనుకాక అందలి చైతన్యాన్ని దర్శింపగలం. ఇదంతా శాస్త్రీయ విధానమే తప్ప అశాస్త్రీయం కాదు. "కష్టమ్ శాస్త్రమ్" అన్నట్లు ఈ శాస్త్రీయత గ్రహింపగల్గడం ఒక ప్రత్యేక సంస్కారం. మనస్సు శుద్ధమై, స్థిరమై, ఏకాగ్రమై బహిర్గతంకాక తన ఉత్పత్తి స్థానమగు ఆత్మయందు విలీనమగు నిర్గుణోపాసనకు సుగుణోపాసన అత్యవసరమగు విషయం, మనస్తత్వ శాస్త్ర విహితం తప్ప అనాలోచిత వ్యవహారం కాదు. కాబట్టి విగ్రహారాధన శాస్త్రీయ సిద్ధాంతము, ఆధ్యాత్మికంలో అత్యావశ్యకము. ఈ సైన్సును నేటి సైంటిస్టులకంటే గొప్ప పరిశోధనల ద్వారానే ప్రాచీనకాలపు సైంటిస్టులైన మన మహర్షులు నిరూపించి తెల్పారు. నిశించుట, విపరీత స్థితులు పొందుట లేని ఉత్తమ శిలను ప్రతిష్ఠామూర్తులకు వినియోగించుట శ్రేష్ఠం. అందుకే శిలా విగ్రహాలే ప్రతిష్ఠిత మవటం చూస్తాం. యంత్రగత మంత్రాధిష్ఠాన దేవతాశక్తిని తనలోకి స్వీకరించే గుణము శిలామూర్తికి ఉంది. అందుకే యంత్రముపై శిలావిగ్రహాలనే అనాదిగా ప్రతిష్ఠించడం జరుగుతోంది.
పుస్తక రచయిత: డాక్టర్. అన్నదానం చిదంబరశాస్త్రి.
అన్ని మతాలవారు వారి దేవుళ్ళయొక్క, దేవాలయాల యొక్క చిత్రాలను, కట్టడాలను దైవ సమంగా పవిత్రంగా చూసుకొంటున్నారంటే పరోక్షంగా వారూ విగ్రహారాధనను అంగీకరించినట్లే. ప్రతి దేశానికి ఒక జాతీయ జెండా ఉంటుంది. దానిని చించినా తగులబెట్టినా వారిని కఠినంగా శిక్షిస్తారు. "అది గుడ్డయేకదా!" అంటే కాదు అది ఆ దేశానికే ప్రతీక. దానిని అవమానిస్తే ఆ దేశాన్ని అవమానించినట్లు.
విగ్రహారాధన గురించి, అలాగే దేవాలయ వ్యవస్థ గురించి చక్కగా వివరించే ఈ 40 పేజీల పుస్తకాన్ని ఇక్కడ చదవండి (Click here to read).
పుస్తక రచయిత: డాక్టర్. అన్నదానం చిదంబరశాస్త్రి.