Content feed Comments Feed

జై శ్రీరామ్
జై హనుమాన్

ఒక గృహస్థు ఒక బ్రాహ్మణునికి ఒకానొక పర్వదినమున ఒక గోవును దానం చేశాడు. ఆ సంగతి తెలిసిన నలుగురు దొంగలు ఎలాగైనా ఆ గోవును తమ సొంతం చేసుకోవాలనే పన్నాగంతో నలుగుర్లో ఒకడు ఆ బ్రాహ్మణునికెదురేగి అయ్యయ్యో ఏమి బ్రాహ్మణుడివయ్యా మేకను తీసుకొని పోతున్నావేంటీ అని వెటకారంగా అనే సరికి బ్రాహ్మణుడు కోపంతో ఇది మేకకాదు ఆవు అని చెప్పి ముందుకు వెళ్ళిపోయాడు. మరికొంతదూరం వెళ్ళాక మరొకడు ఛీ!ఛీ!ఛీ! బ్రాహ్మణులు కూడా మేకలను తినేస్తుంటే ఏంచేస్తాం, అని అసహ్యంతో చెప్తూ వెళ్ళే సరికి ఆ బ్రాహ్మణుడికి అనుమానమేసి గోవువైపు చూశాడు. మరికొంత దూరం వెళ్ళేసరికి మరొకడు ఎదురుపడి అయ్యో పిచ్చి బ్రాహ్మణుడా! తింటే తిందువుగానీ కానీ ఇంత బాహాటంగా మేకను తీసికెళ్తున్నావు. సిగ్గనిపించటల్లేదా అని అడిగేసరికి చాలా అయోమయానికి గురైన ఆ బ్రాహ్మణుడు అలాగే మరికొంతదూరం వెళ్ళేసరికి నాలుగోవాడు ఎదురుపడి, ఏం పంతులుగారూ! మేకను తీసుకొని వెళ్తున్నారు. ఈ రోజు మీ ఇంట్లో విందు భోజనమనుకుంటాను. మమ్మల్నికూడా రమ్మంటారా అని అడిగేసరికి ఆ బ్రాహ్మణుడు ఇంతమందికి ఇది మేకగా కనపడుతోంది. ఇది నిజంగా మేకనే అయిఉండవచ్చనీ దానిని అక్కడే వదలి వెళ్ళిపోయినట్లు.........

ఛీఛీ! ముఖాన ఆభస్మమేంటి ఆచందనమేంటి బొట్టేంటి అసహ్యంగా మేంచూడండి పౌడర్లు క్రీములు స్నోలు అనే సరికి ముఖాన భస్మరేఖలు, చందనము కుంకుమ అన్నీమానేసి, పౌడర్లు, స్నోలు, క్రీములు మొదలుపెట్టాం....గుళ్ళూ గోపురాలకు వెళ్ళి రాళ్ళకీ చెట్లకూ పూజలు చేస్తారా అని హేళనచేస్తుంటే అవన్నీ మానేసి క్లబ్బులకూ పబ్బులకూ వెళ్ళటం అలవాటు చేసుకున్నాం.

తల్లీదండ్రులను పూజిస్తున్నారా, వాళ్ళగొప్పదనమేముంది. జస్ట్ ఇటీజ్‌నేచురల్. వాళ్ళు కలిస్తే మీరు పుట్టారు అంతమాత్రంచేత తల్లీదండ్రులను పూజిస్తారేంటీ.... పాడు అనేసరికి వారిని ఓల్డేజిహోముల్లో వదిలేస్తున్నాం.

ఛీఛీ పళ్ళు తోముకోవటానికి వేపపుల్లలు, ఉప్పు వాడతారా...అనాగరికులు...అనేసరికి ఉప్పు, వేపపుల్లలు, ఉత్తరేణిపుల్లలు మానేసి పేస్ట్ బ్రెష్‌లు వాడటం మొదలెట్టాం. ఇప్పుడు మీ పేస్టులో వేపగుణాలు ఉన్నాయా? మీ పేస్టులో ఉప్పు ఉన్నాదా? అంటుంటే వెఱ్ఱిముఖాలతో తల ఊపేస్తున్నాం... ఛీఛీ సికాకాయి, కుంకుడుకాయి, ఆముదం, మందారతైలాలు వాడుతారా అనేసరికి అవన్నీ మానేసి షాంపోలు అలవాటు చేసుకున్నాం. ఇప్పుడు మీ బట్ట తలపైన జుట్టు మొలిపిస్తాం అంటున్నారు... గ్రేట్ కదూ.

పిల్ల అందము, గుణములు, ఎత్తులావు, కన్నూముక్కు, మొఖము, పెదవులు, చెవులు, గూని, నడక, గాత్రము, ఇవన్నీ పరిశీలించి, పిల్ల తల్లిదండ్రుల చరిత్ర, తాతముత్తాతల, మేనమామ, మేనత్తల చరిత్ర వంశ చరిత్ర ఇవన్నీ చూసి పిల్ల గుణాలు గణాలు. తారాబలం, చంద్రబలం యోని పొంతనము నాడీపొంతనము రాశిపొంతనము అన్నీ చూసి వధూవరులకు తగిన బలమైన ముహూర్తం లభించేదాకా ఆగి కట్నాలుకానుకలతో అనేకమంది బంధుమిత్రుల, పండుముత్తైదువల నిండు దంపతుల ఆశీస్సులు సలహాలతో....

ఆమ్మో!... మీ పెళ్ళిళ్ళకి ఇంత తతంగమా... మా పెళ్ళిళ్ళుచూడండి, చక్కగా పిల్లపిల్లాడికి, పిల్లాడికి పిల్లనచ్చితేచాలు. వెంటనే వెళ్ళి ఉంగరాలు మార్చుకుని నడిరోడ్డులోనైనా సిగ్గులేకుండా ముద్దులు పెట్టేసుకుంటాం. ఒకళ్ళమీద ఒకళ్ళకి మోజు తీరిపోతే ఈజీగా విడిపోయి ఎవరికి వారు వేరే పెళ్ళిళ్ళుచేసుకుంటాం. మీకు పెళ్ళిచేసుకునే అధికారం మాత్రమే ఉంది. విడిపోయే అధికారం లేదు. అనేసరికి...

ఇదేదో బాగుందనుకొని వావివరుసలు, వయస్సు, కుల గోత్రాలు పట్టించుకోకుండా మైనార్టీ తీరితేచాలు తల్లిదండ్రులగుండెల మీద తన్ని చెప్పాపెట్టకుండా ఇల్లు వదిలిపారిపోయి ఫ్రెండ్స్‌ని అడ్డం పెట్టుకొని దండలు మార్చుకొని దిక్కులేని బతుకులు బతికెయ్యటానికి మెల్లిగా అలవాటు పడుతున్నాం. తాచెడ్డకోతి వనమెల్లచెరచెనన్నట్టు ఎవరన్నా ఎదురుపడితే ఎంతో స్టైల్‌గా మీది అరేంజిడ్ మ్యారేజా లవ్ మ్యారేజా, రీమ్యారేజా అని మనంచేసిన వెధవపనిని సమర్థించుకోవటం కూడా మనకి తెలిసిపోయింది.

అబ్బా! వెరీగుడ్ ఇప్పుడు మీరు మాలాగానే చాలా విషయాలు నేర్చుకున్నారు.

కానీ....ఆచారాలు కట్టుబాట్లు నియమాలు నదీస్నానాలు, పుణ్యక్షేత్రాలు, పూజా పునస్కారాలు, తల్లీతండ్రీ గురువుదైవము. వేదము పురాణము ఉపనిషత్తులు బ్రహ్మసూత్రములు గుళ్ళు, గోపురాలు పితృదేవతలు శ్రాద్ధాలు తర్పణాలు, బ్రాహ్మణ పూజ, గోపూజ, తులసి, మారేడు, రావి, మఱ్ఱి, జువ్వి, పాలాశ, వేపచెట్లపూజలు, దానము, ధర్మము, దయ, పాత్రత, శీలము, నీతి, నైతికవిలువలు, ఇట్లాంటి బూజు పట్టిన ఎప్పుడో మధ్యయుగంనాటి అనాగరిక పద్ధతులను ఇంకా కొనసాగిస్తున్న హిందూమంతంలో ఉంటారా! ఛీఛీ!...అనగానే... నిజమేకదా అనిపించి మెల్లగా హిందూమతాన్ని వదిలే ప్రయత్నం చేస్తున్నాము.

వ్హా! వాట్ ఎగ్రేట్ గ్లోబలైజ్‌డ్ సివిలైజ్‌డ్ కల్చర్ కదా...!  

4 comments

 1. Anonymous Says:
 2. అధ్బుతంగా చెప్పారు...!! అంతే గాక?? మన నూలువస్త్రాలు,మన అటవీ వుత్పత్తులు ఒకటేమిటి??అన్నీ వాళ్ళ ఆమోదం మరియు వారి బ్రాండ్ పేరు లేనిదే మనం వాడలేనంతగా ప్రలోభానికి గురౌతున్నాము....!!

   
 3. Anonymous Says:
 4. చాలా థాంక్స్ సార్..ఎంతో విలువైన గొప్ప విషయాలను చెప్పినందుకు మీకు కృతజ్గతలు..
  అయ్యో! చూశారా పాశ్చాత్య ప్రభావం నా మీద కూడా ఎంతలా పనచేసిందో .. నా అభిప్రాయాన్ని తెలుపుతూ మిమ్మల్ని అభినందించాలని అనుకున్నా.. కానీ ఆటోమేటిక్ గా నే నేను మీకు ఇంగిలిపీసులో అని చెప్పాల్సి వచ్చింది

   
 5. Anonymous Says:
 6. చాలా థాంక్స్ సార్..ఎంతో విలువైన గొప్ప విషయాలను చెప్పినందుకు మీకు కృతజ్గతలు..
  అయ్యో! చూశారా పాశ్చాత్య ప్రభావం నా మీద కూడా ఎంతలా పనచేసిందో .. నా అభిప్రాయాన్ని తెలుపుతూ మిమ్మల్ని అభినందించాలని అనుకున్నా.. కానీ ఆటోమేటిక్ గా నే నేను మీకు ఇంగిలిపీసులో "Thanks" అని చెప్పాల్సి వచ్చింది

   
 7. Suresh 0743 Says:
 8. వెంకన్న సేవ కి Whatsapp

  https://www.youtube.com/watch?v=X9cAkbSfr0k&feature=youtu.be

   

Post a Comment