Content feed Comments Feed

ఓంకారం – హిందూ సర్వస్వం

హిందూ ధర్మం మొత్తానికి అర్థం ఓంకారంలోనే ఉంది. ఆ మూల తత్వం పూర్తిగా అర్థం చేసుకుంటే తప్ప హిందూత్వం లోని ఏకాత్మత అర్థమయి సకల సందేహాలు తీరవు. హిందూ మతం మొత్తాన్ని ఒక్క వాక్యంలో చెప్పటం కాదు. ఒక్క పదంలో చెప్పటం కాదు. ఒక్క అక్షరంలో చెప్పవచ్చు. అదే “ఓం”. ....

ఆత్మహత్య దిశగా హిందుత్వం

ఒకనాడు విశ్వమంతటికీ జ్ఞానజ్యోతిని చూపిన హిందూ ధర్మం నేడు మినుకుమినుకు మంటూ ఉంది. ముందు జాగ్రత్తపడితే అది భద్రంగా ఉంటుంది. కానీ ఏ ప్రయత్నం చేయకుండా "ఇది నశించదు,శాశ్వతంగా ఉంటుంది" అని ఏదో సమాధానపడిపోతూ నిమ్మకునీరెత్తినట్లు ఊరుకుండిపోయేవారెక్కువయ్యారు. ఒకనాడు ప్రపంచమంతా వ్యాపించిన హిందూ ధర్మానికి ప్రపంచంలో నేటి ఉనికి ఎంత?...

గోమాత

హిందూ ధర్మంలో గోవుకు చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఎంతో విలువైన గోవు హిందువులకు పవిత్రమైనది. అంటే ప్రపంచ మానవాళికే ముఖ్యమైనదని అర్థం. అలా గ్రహింపక మతదృష్టితో చూచి ప్రపంచం చాలా నష్టపోతోంది. ఎవరేమన్నా హిందువులకది తల్లివంటిది, దైవం వంటిది కూడా. అది హిందూ శబ్ద లక్షణంలోనే చెప్పబడింది.
CahayaBiru.com
ఓంకారాన్ని కర్మార్థం ప్రయోగించేటప్పుడు మూడు మాత్రలుగాను, ధ్యానకాలంలోను, ఆత్మోపాసనలోను అర్థమాత్ర అధికంగా పల్కాలి. అంటే మామూలుగా పూజాది కర్మలలో పల్కే దానికంటే అర్థమాత్రకాలం ఎక్కువగా ప్రత్యేక ప్రణవధ్యానంలో, ప్రణవ రూపమైన ఆత్మోపాసనలో పల్కాలి. ఓంకారాన్ని తన ఎదుట వ్రాసుకొని ఆ అక్షర స్వరూపాన్ని ధ్యానిస్తూ దానియందు లగ్నుడై ఉంటే సమస్త ధర్మశాస్త్రాలూ పఠించినట్లే అని చెప్పబడింది. ప్రతి ప్రాణిలో ప్రణవ ధ్వని స్వాభావికంగా ఉంటుంది. అంతఃకరణ నివాసియగు ఆత్మయే బ్రహ్మము. అదే ఓంకారము. కాబట్టి అందరిలోను ఆత్మరూపమగు ఓంకారం ఉంది. దానిని ప్రత్యక్షంగా...
అలా మహాజ్ఞానులకే కాక అజ్ఞానులకు, నిరక్షరాస్యులయిన వారికి కూడా మొదట అవసరమైనది ఓంకారమే. ఎవ్వరికయినా అక్షరాభ్యాసం "ఓం నమః శివాయ సిద్ధం నమః" అనే మొదలుపెడతారు. ఆ విధంగా ప్రతిమనిషికీ మొట్టమొదట నేర్పే అక్షరమే ఓంకారం. ఈ ఓంకారాన్ని అందరూ ఉచ్చరింప కూడదని కొందరంటారు. కాని ఈ అక్షరాభ్యాస సంప్రదాయమే ఓంకారం విషయంలో అలాంటి భేదాభిప్రాయం తగదని చెప్తోంది. ఆయా సంప్రదాయాలను బట్టి అక్షరాభ్యాసం "ఓం గణేశాయనమః" అని కొందరు, "ఓం నమో నారాయణాయ" అని కొందరు చేయటం ఉంది కాని మొదట ఓంకారాన్ని చెప్పే విషయంలో మాత్రం తేడాలేదు. అలా ఓంకారం అన్ని సంప్రదాయాల వారికి...
అమాంతం ధనికులం కావాలనే ఆశతో మతం మారేవారున్నారు. వారికి ధనయోగం ఉన్నప్పుడు ఏదోవిధంగా వారేపని చేసినా కలిసి వచ్చి సంపద చేరుతుంది. హిందూ దేవతల నారాధించే వారంతా ధనంలేని వారు కారు, అన్యమతాల వారు అంతా ధనవంతులూ కారు. ధన, దరిద్రాలు వారి వారి ప్రారబ్ధం బట్టి ఎక్కడున్నా వచ్చి తీరుతాయి. కాని ముక్తి మాత్రం ఓంకారాత్మక దేవతా ఆరాధనతోనే లభిస్తుందనేది సత్యం. ఈ మహత్తరావకాశం కోల్పోవటం దురదృష్టం. ఈ అదృష్టం కోసం అన్యమతాల విజ్ఞులంతా ఇటు వైపు చూస్తుంటే దీనిని వదలుకొనటం...
హిందూమతం అనగానే స్వమతస్థులు, విమతస్థులు కూడా ముఖ్యంగా విమర్శించే విషయం, అర్థం చేసుకోలేకపోయే విషయం ఇందులో అనేక పంథాలుండటం, చాలామంది దేవతలుండటం గూర్చి. “ఏకం సత్ విప్రా బహుధావిదంతి” (1 – 164 – 46) అని, “ఏకం సన్తం బహుధా కల్పయన్తి” (10 – 114 – 5) అని ఋగ్వేదం చెప్తోంది. అంటే ఒకే సత్ పదార్థాన్ని పండితులు అనేక విధాల చెప్తున్నారని అర్థం. ఆ ఒకే ఒక్క సత్యపదార్థమే ఓంకారం. హిందూ ధర్మం మొత్తానికి అర్థం ఆ ఓంకారంలోనే ఉంది. ఆ మూల తత్వం పూర్తిగా అర్థం చేసుకుంటే తప్ప హిందూత్వంలోని ఏకాత్మత అర్థమయి సకల సందేహాలు తీరవు. హిందూ మతం మొత్తాన్ని ఒక్క వాక్యంలో...
ముందుమాటహిందూ ధర్మంలో చాలా కీలకమైన అంశం ఓంకారం. కాబట్టి ఆదిలోనే దానినందిస్తున్నాము. ఓంకారమంటే బ్రహ్మవిద్య. అలాంటి దానిని సామాన్య హిందువుకు కూడా అందించాలనే యత్నం పెద్ద సాహసమే. ఇది ఆత్మవిద్య. ఆత్మకల వారంతా ఆత్మీయతతో చదివి తీరాలి. మీకు గల శ్రద్ధను బట్టి ఇది మీకెంతో ఆత్మానందం కల్గిస్తుంది. మనస్సును ఏకాగ్రం చేసి నిదానంగా దీనిని చదవండి. ఇది మీకు అర్థమయే రీతిని బట్టి మీ స్థాయిని గ్రహించు కోవచ్చు. మీరో మారు చదివితే తప్పక అంతా గ్రహింపగల్గుతారు. కంప్యూటరు విషయం సామాన్యుల కర్థమయేటట్లు చెప్పాలంటే కొన్ని అయినా సాంకేతిక పదాలు ఉపయోగించక తప్పదు....