Content feed Comments Feed

ఓంకారం – హిందూ సర్వస్వం

హిందూ ధర్మం మొత్తానికి అర్థం ఓంకారంలోనే ఉంది. ఆ మూల తత్వం పూర్తిగా అర్థం చేసుకుంటే తప్ప హిందూత్వం లోని ఏకాత్మత అర్థమయి సకల సందేహాలు తీరవు. హిందూ మతం మొత్తాన్ని ఒక్క వాక్యంలో చెప్పటం కాదు. ఒక్క పదంలో చెప్పటం కాదు. ఒక్క అక్షరంలో చెప్పవచ్చు. అదే “ఓం”. ....

ఆత్మహత్య దిశగా హిందుత్వం

ఒకనాడు విశ్వమంతటికీ జ్ఞానజ్యోతిని చూపిన హిందూ ధర్మం నేడు మినుకుమినుకు మంటూ ఉంది. ముందు జాగ్రత్తపడితే అది భద్రంగా ఉంటుంది. కానీ ఏ ప్రయత్నం చేయకుండా "ఇది నశించదు,శాశ్వతంగా ఉంటుంది" అని ఏదో సమాధానపడిపోతూ నిమ్మకునీరెత్తినట్లు ఊరుకుండిపోయేవారెక్కువయ్యారు. ఒకనాడు ప్రపంచమంతా వ్యాపించిన హిందూ ధర్మానికి ప్రపంచంలో నేటి ఉనికి ఎంత?...

గోమాత

హిందూ ధర్మంలో గోవుకు చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఎంతో విలువైన గోవు హిందువులకు పవిత్రమైనది. అంటే ప్రపంచ మానవాళికే ముఖ్యమైనదని అర్థం. అలా గ్రహింపక మతదృష్టితో చూచి ప్రపంచం చాలా నష్టపోతోంది. ఎవరేమన్నా హిందువులకది తల్లివంటిది, దైవం వంటిది కూడా. అది హిందూ శబ్ద లక్షణంలోనే చెప్పబడింది.
CahayaBiru.com
జై శ్రీరామ్జై హనుమాన్ ఒక గృహస్థు ఒక బ్రాహ్మణునికి ఒకానొక పర్వదినమున ఒక గోవును దానం చేశాడు. ఆ సంగతి తెలిసిన నలుగురు దొంగలు ఎలాగైనా ఆ గోవును తమ సొంతం చేసుకోవాలనే పన్నాగంతో నలుగుర్లో ఒకడు ఆ బ్రాహ్మణునికెదురేగి అయ్యయ్యో ఏమి బ్రాహ్మణుడివయ్యా మేకను తీసుకొని పోతున్నావేంటీ అని వెటకారంగా అనే సరికి బ్రాహ్మణుడు కోపంతో ఇది మేకకాదు ఆవు అని చెప్పి ముందుకు వెళ్ళిపోయాడు. మరికొంతదూరం వెళ్ళాక మరొకడు ఛీ!ఛీ!ఛీ! బ్రాహ్మణులు కూడా మేకలను తినేస్తుంటే ఏంచేస్తాం, అని అసహ్యంతో చెప్తూ వెళ్ళే సరికి ఆ బ్రాహ్మణుడికి అనుమానమేసి గోవువైపు చూశాడు. మరికొంత దూరం...
జై శ్రీరామ్జై హనుమాన్ బృహస్పతి భార్య తారకు బృహస్పతి శిష్యుడైన చంద్రుడికి పుట్టినవాడు బుధుడు. మనువుకుమారుడైన సుద్యుమ్నుడు ఒక కొలనులో స్నానము చేయగా స్త్రీగా మారిపోయెను ఆమె పేరు ఇల. ఆమెను బుధుడు చూచి వివాహమాడెను. వారిరువురకు కలిగిన కుమారుడు పురూరవుడు. బృహస్పతి నవగ్రహాలలో ఒక గ్రహం. తార అనేది నక్షత్రం బుధుడు నవగ్రహాలలో ఒక గ్రహం. ఆ బుధుడి కుమారుడు మాత్రం మనిషే షట్చక్రవర్తులలో ఒకడైన పురూరవుడు. నమ్మబుద్ధికావటం లేదు కదూ.... కానీ అదే నిజం. స్వధ...
జై శ్రీరామ్జై హనుమాన్నిండా నూరేళ్ళు బ్రతికి సర్వవిధాల ఉన్నతిని సాధింపదగిన మనుష్యుడు అల్పాయుష్కుడై అకాల మరణం వాత పడుతున్నాడు. మరణమైనా కొంతమేలేగాని కొందరు జీవించినంత కాలం రోగ పీడితులై తమకు, తోటి వారికి కూడా భరింపరాని రీతిలో జీవింపగల్గుతున్నారు. "ఎప్పుడు ప్రాణం పోతుందా" అని ఎదురు చూచే స్థితికి కూడా వస్తున్నాడు. ఇహమునకు, పరమునకు కొరగాని పాడుజన్మను నిందించుకొనుట తప్ప అట్టి వారు చేయగలదిలేదు. సదాచార సంపద సాధిస్తే వారికీదురవస్థ ఏపడదు. చతుర్విధ పురుషర్థ సాధనే జీవిత లక్ష్యం. "ధర్మార్థ కామ మోక్షాణాం మూలముక్తం కళేబరం" అని అన్నిటికీ ఈ దేహమే...