ఓం శ్రీరామజయ హనుమాన్
జంతూనాం నరజన్మ దుర్లభం అంటే ప్రాణ కోటిలో మనుష్య జన్మ లభించటం గొప్ప అదృష్టం అని మహనీయులు చెప్తుండగా లోకంలో ఎందుకు బ్రతుకుతున్నామో, ఎందుకు బ్రతకాలో తెలియని వారే అనేకులు కనబడుతున్నారు. విజ్ఞుడైన మనుష్యుడు ఇహమున ధర్మ, భోగాలని; పరంలో ముక్తిని సాధించటం కోసం బ్రతుకుతాడు. జన్మ సార్థకం అవడానికి ఏది సాధించాలన్నా ఉత్తమ మార్గం ధర్మాచరణ. అట్టి ధర్మాన్ని ఆచరించటానికి ప్రధాన సాధనం ఈ శరీరమే. అందుకే "శరీర మాద్యం ఖలు ధర్మసాధనం" అని ఋషులచే పేర్కొనబడింది. కాబట్టి ధార్మికుని ప్రథమ కర్తవ్యం అటువంటి ధర్మ సాధనమైన శరీరాన్ని రక్షించుకొనటమే....