Content feed Comments Feed

హిందూధర్మం యొక్క మూల సూత్రాలలో ఒకటి విగ్రహారాధన. అన్యమతాలు దీనిని అంగీకరింపవుకాని, పరోక్షంగా ఆచరిస్తూనే ఉంటాయి. విగ్రహారాధనను తిరస్కరించే వారంతా దానిని అనుసరిస్తున్నవారే. దీన్ని నిరూపించే చక్కని సంఘటన వివేకానందుని చరిత్రలో కన్పడుతుంది. పాశ్చాత్య ప్రభావానికి లోబడిన ఆళ్వారు మహారాజు హిందూ ధర్మాచారాలను వ్యతిరేకించేవాడు. స్వామీజీముందు విగ్రహారాధనను గూర్చి చెడుగా విమర్శించాడు. కొద్ది సమయం ఆగి వివేకానందస్వామి దివానును పిలిచి రాజుగారి పటం తీయించి దానిపై ఉమ్మి వేయమని చెప్పాడు. దివాన్ "మహారాజుకు అవమానం చేయజాలనని" బదులిచ్చాడు. వెంటనే వివేకానంద "రంగుపూసిన గుడ్డమీది బొమ్మపై ఉమ్మివేయడం మీ మహారాజునవమానించడం ఎలా అవుతుంది?" అంటూ ఆళ్వారు రాజుతో "ఈ చిత్రంలో వీరు మహారాజును చూస్తున్నారు. అలాగే భక్తులు విగ్రహంలో భగవంతుని చూడటంలో తప్పేముంది?" అనటంతో ఆళ్వారు మాహారాజుకు ఙ్ఞానోదయమైంది.

అన్ని మతాలవారు వారి దేవుళ్ళయొక్క, దేవాలయాల యొక్క చిత్రాలను, కట్టడాలను దైవ సమంగా పవిత్రంగా చూసుకొంటున్నారంటే పరోక్షంగా వారూ విగ్రహారాధనను అంగీకరించినట్లే. ప్రతి దేశానికి ఒక జాతీయ జెండా ఉంటుంది. దానిని చించినా తగులబెట్టినా వారిని కఠినంగా శిక్షిస్తారు. "అది గుడ్డయేకదా!" అంటే కాదు అది ఆ దేశానికే ప్రతీక. దానిని అవమానిస్తే ఆ దేశాన్ని అవమానించినట్లు.

విగ్రహారాధన గురించి, అలాగే దేవాలయ వ్యవస్థ గురించి చక్కగా వివరించే ఈ 40 పేజీల పుస్తకాన్ని ఇక్కడ చదవండి (Click here to read).

పుస్తక రచయిత: డాక్టర్. అన్నదానం చిదంబరశాస్త్రి.




1 Responses to విగ్రహారాధన -- దేవాలయ వ్యవస్థ

  1. Anonymous Says:
  2. "హిందూధర్మం యొక్క మూల సూత్రాలలో ఒకటి విగ్రహారాధన".

    విగ్రహారాధన మధ్యలొ వచ్చిన ప్రక్రియ. అది చాలా పురాతనమైనది. కాని "ఆది" లొ వచ్చినది కాదు. అది ఒక ప్రక్రియ మాత్రమే. మూల సూత్రాలకు మరియు ప్రక్రియ చాలా తేడావుంది.

    ప్రక్రియ కొతకాలానికి పొవచ్చు, దాని ప్రాదాన్యత తగ్గవచ్చు. కాని మూల సూత్రాలు అలాకాదు. అవి పొతే ఇంక ఏమి వుండదు.

    ఉదాహరణకు:- కిరస్తానీల మూల సూత్రం: "ఏసు జూదుల యొక్క దేవుని కుమారుడు". "అతను చచ్చి బతికాడు".

    a) అతను జూదుల యొక్క దేవుని కుమారుడు కాదు, b) లేక అతను చావలేదు, c) చచ్చినా తిరిగి బతకలేదు, d) అసలు అలాంటి మనిషి 2000 సంవసరాల క్రితం ఎవరు లేరు అని నిరూపిస్తే, ఇక కిరస్తానీ మతము వుండదు.

    ఉదాహరణకు reference ఈ దిగువన చూడండి.
    http://truthbeknown.com/christconspiracy.html

     

Post a Comment