రాయిలోనూ జీవశక్తి ఉన్న విషయం సైన్సు అంగీకరిస్తుంది. పదార్థాలన్నీ అణు నిర్మితాలే. అణువులో పరమాణువులు ఉంటాయి. పరమాణువులో కేంద్రకం అనగా న్యూక్లియస్ ఉండి, దానిలో ధనావేశిత ప్రోటాన్లు, న్యూట్రాన్లు, వానిచుట్టూ నిర్దిష్ట క్రమంలో తిరిగే ఋణావేశిత ఎలక్ట్రానులు ఉంటాయనేది సైన్సు చెపుతున్న సత్యం. నిరంతరం భ్రమించే సూక్ష్మాణువులు ఉన్నపుడు, శిలలు జీవంలేనివని ఎలా అనగలం? భగవంతుడు సర్వాంతర్యామిగా అందరూ అంగీకరిస్తారు. కాబట్టి ప్రతిమ యందూ భగవంతుడున్నట్లే. కాగా ఆ దైవత్వ ఉనికిని ప్రతిష్ఠా కలాపం ద్వారా మంత్ర యంత్ర తంత్ర శక్తులచే అందు పూర్ణమూ, స్థిరమూ...
హిందూధర్మం యొక్క మూల సూత్రాలలో ఒకటి విగ్రహారాధన. అన్యమతాలు దీనిని అంగీకరింపవుకాని, పరోక్షంగా ఆచరిస్తూనే ఉంటాయి. విగ్రహారాధనను తిరస్కరించే వారంతా దానిని అనుసరిస్తున్నవారే. దీన్ని నిరూపించే చక్కని సంఘటన వివేకానందుని చరిత్రలో కన్పడుతుంది. పాశ్చాత్య ప్రభావానికి లోబడిన ఆళ్వారు మహారాజు హిందూ ధర్మాచారాలను వ్యతిరేకించేవాడు. స్వామీజీముందు విగ్రహారాధనను గూర్చి చెడుగా విమర్శించాడు. కొద్ది సమయం ఆగి వివేకానందస్వామి దివానును పిలిచి రాజుగారి పటం తీయించి దానిపై ఉమ్మి వేయమని చెప్పాడు. దివాన్ "మహారాజుకు అవమానం చేయజాలనని" బదులిచ్చాడు. వెంటనే వివేకానంద...